logo
జాతీయం

మావోలకు భారీ ఎదురుదెబ్బ

మావోలకు భారీ ఎదురుదెబ్బ
X
Highlights

మావోలకు బిగ్ షాక్ తగిలింది. మావోల నెట్ వర్క్‌ను బలోపేతంచేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న నక్కా వెంకటరావు అనే...

మావోలకు బిగ్ షాక్ తగిలింది. మావోల నెట్ వర్క్‌ను బలోపేతంచేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న నక్కా వెంకటరావు అనే వ్యక్తిని ఛత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మావోలకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటరావు హైదరాబాద్ ఎన్జీఆర్ఐలో ఉద్యోగి. 2016, 2017లలో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశం అయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నక్కా సోదరుడు పౌరహక్కుల సంఘంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడన్నారు. అర్బన్ నక్సలిజమ్ వ్యాప్తిలో వెంకటరావు కీలక పాత్ర పోషిస్తున్నాడని ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్,తెలంగాణ, ఒడిషాలలో ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేశాడని పోలీసులు తెలిపారు.

Next Story