logo
జాతీయం

సీఎం ప్రమాణస్వీకారానికి వర్షం అడ్డంకి

సీఎం ప్రమాణస్వీకారానికి వర్షం అడ్డంకి
X
Highlights

నేడు ఛత్తీస్ గడ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత భూపెశ్ భగేల్ ప్రమాణస్వీకారం చేయాల్సిఉండే కాగా ఈ కార్యక్రమానికి...

నేడు ఛత్తీస్ గడ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత భూపెశ్ భగేల్ ప్రమాణస్వీకారం చేయాల్సిఉండే కాగా ఈ కార్యక్రమానికి వనదేవుడు అడ్డుగా నిలిచాడు. భూపెశ్ ప్రమాణస్వీకారం కొద్దిగా లేటుగానే ప్రమాణస్వీకారం చేస్తాడులే అనుకుండేమో వానదేవుడు తెల్లవారుజామునుండి ఎడతెరిపి వాన కురుస్తుండడంతో భూపెశ్ ప్రమాణ స్వీకారం చేయాల్సిన వేదికను ఇంకో దిక్కు మార్చారు. షెడ్యూల్‌ ప్రకారం రాయ్‌పూర్‌లోని సైన్స్‌ కాలేజీ మైదానంలో ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండే వానతో మైదానం మొత్తం తడిసి ముద్దైంది. ఇక లాభం లేదని అధికారులు హుటాహుటినా బల్బీర్‌ జునేజా ఇండోర్‌ స్టేడియంకు మార్చారు. ప్రస్తుతం అక్కడ భూపెశ్ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారు. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కొద్ది సేపటి క్రితమే భూపేశ్‌ భగేల్‌ స్టేడియంకు చేరుకున్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఇతర రాజకీయ పార్టీల నేతలు హాజరుకానున్నారు.

Next Story