పిల్లలను చంపేసి...ప్రియుడితో పారిపోయింది...

తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడిన మహిళ ఇద్దరు పిల్లలకు విషం పెట్టి...
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడిన మహిళ ఇద్దరు పిల్లలకు విషం పెట్టి చంపేసింది. రాత్రి ఇంటికి వచ్చే భర్తను కూడా హత్య చెయ్యాలని నిర్ణయించింది. అయితే ఉద్యోగరీత్యా భర్త రాత్రి ఇంటికి రాకపోవడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. పిల్లలను హత్య చేసి ప్రియుడితో కలిసి ఎస్కేప్ అయ్యింది. పల్లావరం సమీపంలోని కుండ్రత్తూర్‌కి చెందిన బ్యాంక్ ఉద్యోగి విజయ్(34), అభిరామి(28) దంపతులకు అజయ్(5) అనే కుమారుడు, కారుణ్య(4) అనే కుమార్తె ఉన్నారు. అదే ప్రాంతంలోని ఓ బిర్యానీ దుకాణంలో పనిచేస్తున్న సుందరం అనే యువకుడితో అభిరామికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం గమనించిన చుట్టుపక్కల వారు విజయ్ దృష్టికి తీసుకురాగా... భార్యను నిలదీశాడు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు.
దీంతో సదరు మహిళ ప్రియుడితో కలసి ఉండేందుకు భర్త, ఇద్దరు పిల్లలను చంపేయాలని నిర్ణయించుకుంది. అయితే బ్యాంకులో పని ఎక్కువగా ఉండటంతో తాను ఆలస్యంగా వస్తానని శుక్రవారం విజయ్ భార్యకు చెప్పాడు. దీంతో ఆమె ఇద్దరు పిల్లలకు ఆ రోజు రాత్రి పాలలో విషం కలిపి ఇచ్చింది. అనంతరం ప్రియుడితో కలసి కోయంబేడు బస్టాండ్ కు వెళ్లి నాగర్ కోయిల్ బస్సు ఎక్కేసింది. రాత్రి ఇంటికివచ్చిన విజయ్ తలుపులు మూసిఉండటం, లైట్లు వెలుగుతూ ఉండటంతో రెండో తాళంతో ఇంటి లోపలకు వెళ్లాడు. అక్కడ నేలపై ఇద్దరు పిల్లలు నురగలు కక్కుతూ అచేతనంగా పడిఉండటంతో వెంటనే అంబులెన్సుకు, పోలీసులకు సమాచారం అందించాడు. ఈ పిల్లలను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక సుందరాన్ని అరెస్ట్ చేసిన అధికారులు అభిరామి కోసం గాలిస్తున్నారు. తొలుత పిల్లలతో పాటు భర్త విజయ్ ను కూడా చంపేయాలని అభిరామి నిర్ణయించుకుందనీ, కానీ కుదరకపోవడంతో పిల్లలకు విషమిచ్చిందని సుందర్ విచారణలో తెలిపాడు.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
ముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
19 Aug 2022 4:15 PM GMTBanana Problems: అరటిపండు అతిగా తింటే వచ్చే సమస్యలు ఇవే..!
19 Aug 2022 4:00 PM GMTకన్నీటి పర్యంతమైన 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ'.. డిప్యూటీ సీఎం సాయం..
19 Aug 2022 3:45 PM GMTసుకన్య సమృద్ధియోజన, పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర వడ్డీరేట్లు పెరిగే...
19 Aug 2022 3:30 PM GMTPM Modi: దేశంలో 10 కోట్ల ఇళ్లకు తాగునీరు..
19 Aug 2022 3:15 PM GMT