‘వ్యక్తిగత స్వేచ్ఛ’పై రాద్దాంతం ఎందుకు?

‘వ్యక్తిగత స్వేచ్ఛ’పై రాద్దాంతం ఎందుకు?
x
Highlights

కంప్యూటర్లే కాదు మీ చేతిలోని స్మార్ట్‌‌ఫోన్స్ కూడా, కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘానీడలోనే ఉంటాయి. మీ సమస్త సమాచారాన్ని జల్లెడపడతాయి. భద్రత పేరుతో...

కంప్యూటర్లే కాదు మీ చేతిలోని స్మార్ట్‌‌ఫోన్స్ కూడా, కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘానీడలోనే ఉంటాయి. మీ సమస్త సమాచారాన్ని జల్లెడపడతాయి. భద్రత పేరుతో వ్యక్తిగత సమాచారంపై నిఘా పెడుతోంది కేంద్రం. మొన్ననే ఆధార్‌ కంపల్సరీ కాదు, అడిగితే కోటి జరిమానా తప్పదని సుప్రీం తీర్పిచ్చినా, కేంద్రం మరోసారి, పౌరుల వ్యక్తిగతంపై గురిపెట్టడం, విమర్శలకు దారి తీస్తోంది. ప్రభుత్వం నిర్ణయం సరైందేనా మరీ భయపడేలా డెసిషన్ ఉందా? విపక్షాలు ఏమంటున్నాయి. నిపుణులు విశ్లేషణ ఏంటి?
ప్రతి కంప్యూటర్‌ మీద ప్రభుత్వ నిఘా కొనసాగుతుందన్న, కేంద్ర హోంశాఖ ఉత్తర్వులపై తీవ్ర వ్యతిరేకతా స్వరం వినిపిస్తోంది. చట్టం పేరు చెప్పి, దర్యాప్తు సంస్థల అధికారులు, పోలీసులు పీడిస్తారన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

సెక్షన్‌ 69 ముసుగులో కేంద్ర ప్రభుత్వం, పౌరుల వ్యక్తిగత గోప్యతను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఎంపీలు, న్యాయనిపుణులు విమర్శిస్తున్నారు. వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అనేక నిర్ణయాలు, సెక్షన్‌లను కోర్టులు కొట్టివేశాయని, ఇది కూడా కోర్టుల్లో నిలబడదని చెబుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇన్నికోట్ల మందిపై నిఘా పెట్టడం అసాధ్యమంటున్నారు. మొత్తానికి కేంద్రం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories