logo
తాజా వార్తలు

త‌త్కాల్ పై క‌న్నేసిన సీబీఐ

త‌త్కాల్ పై క‌న్నేసిన సీబీఐ
X
Highlights

రైల్వే త‌త్కాల్ బుకింగ్ లో కుంభ‌కోణం జ‌రిగింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)...


రైల్వే త‌త్కాల్ బుకింగ్ లో కుంభ‌కోణం జ‌రిగింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అప్ర‌మ‌త్త‌మైంది. కొద్దిరోజుల క్రితం త‌త్కాల్ బుకింగ్ లో అక్ర‌మ‌లు జ‌రుగుతున్నాయ‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో విచార‌ణ చేప‌ట్టిన అధికారులు సీబీఐలో ప్రోగ్రామ‌ర్ గా ప‌నిచేస్తున్న అజ‌య్ గార్గ్ అనే వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే గార్గ్ విచార‌ణ‌లో కొన్ని విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. తానే అక్ర‌మంగా సాఫ్ట్ వేర్ త‌యారు చేసి దాన్ని ద‌ళారుల‌కి అమ్మి త‌త్కాల్ బుకింగ్ తో సొమ్ము చేసుకుంటున్న‌ట్లు ఒప్పుకున్నాడు. అంతేకాదు త‌త్కాల్ టికెట్లను ఎవ‌రైనా అక్ర‌మంగా బుకింగ్ చేసుకోవాలంటే సంబంధిత సాఫ్ట్ వేర్ లో ఆన్ లైన్ లో దొరుకుతున్నాయ‌ని తెలిపాడు. ప్రస్తుతం అలాంటి సాఫ్ట్‌వేర్ ఎక్క‌డ నుంచి త‌యారు చేస్తున్నారు. ఎవ‌రు అమ్ముతున్నారు. ఎంత‌మొత్తానికి అమ్ముతున్నారు అనే విష‌యాల‌పై సీబీఐ దృష్టి సారించింది. సాఫ్ట్ వేర్ తోనే కాకుండా ఏజెంట్ల ద్వారా టికెట్లను కొనుగోలు చేసి ఆ టికెట్ల‌ను ప్ర‌యాణికుల‌కు పెద్ద‌మొత్తంలో అమ్ముతున్నార‌ని గుర్తించారు. అలాంటి వారు ఎవ‌రైన త‌మ‌దృష్టిలోకి వ‌స్తే అరెస్ట్ చేస్తామ‌ని సీబీఐ అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. తత్కాల్‌ టికెట్ల విక్రయం ప్రారంభమైనప్పుడు కొందరు ఇలాంటి సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఒకేసారి పలు యూజర్‌ ఐడీలతో లాగిన్‌ అవ్వడంతో పాటు ఒకే క్లిక్‌తో పెద్దమొత్తంలో టికెట్లను పొందుతున్నారని వెల్లడించాడు.

Next Story