అగస్టా స్కామ్‌లో కీలక మలుపు..

అగస్టా స్కామ్‌లో కీలక మలుపు..
x
Highlights

అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిస్టియన్‌ మిషెల్‌ను సీబీఐ ఢిల్లీ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టింది. ఈ కేసు దర్యాప్తు...

అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిస్టియన్‌ మిషెల్‌ను సీబీఐ ఢిల్లీ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టింది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్నందు వల్ల మిషెల్‌కు కస్టడీ అవసరమని సీబీఐ కోర్టుకు తెలిపింది. డబ్బు దుబాయికి చెందిన రెండు ఖాతాల్లోకి చేరిన విషయంపై దర్యాప్తు కొనసాగిస్తున్నందున మిషెల్ నుంచి పలు దస్త్రాలు సేకరించేందుకు 5 రోజుల కస్టడీ విధించాలని కోరింది. సీబీఐ వినతికి కోర్టు అంగీకరించింది. ఈ మేరకు 5 రోజుల సీబీఐ కస్టడీ విధించింది.

అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కొనుగోలు స్కామ్‌ విచారణలోసీబీఐ అధికారులు పురోగతి సాధించారు. ఈ స్కామ్‌ లో గతేడాది నుంచి దుబాయ్‌ లో శిక్ష అనుభవిస్తున్న మధ్యవర్తి క్రిస్టియన్‌ జేమ్స్‌ మైకేల్‌ ను ఢిల్లీ తీసుకొచ్చారు అధికారులు. అజిత్‌ దోవల్‌ సహకారంతో మైకేల్‌ను భారత్‌కు అప్పగించేందుకు యూఏఈ అంగీకరించింది. ఈస్కామ్‌ లో మైకెల్‌ రూ .225 కోట్ల ముడుపులు తీసుకున్నారని ఈడీ 2016లో చార్జిషీటు దాఖలు చేసింది. మైకెల్‌ అరెస్ట్‌ తో యూపీఏ నేతలు చిక్కుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మైకేల్‌ ను విచారిస్తే అసలు దోషులెవరో బయటపడనుందంటున్నారు అధికారులు . ఈ స్కామ్‌ తో కేంద్ర ఖజానాకు సుమారు రూ.2666 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు రావడంతో 2014 జనవరి 1న ఆ ఒప్పందాన్నికేంద్రం రద్దు చేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories