శ్రీరాముడిపై వ్యాఖ్యలు: కత్తి మహేశ్‌పై కేసు

శ్రీరాముడిపై వ్యాఖ్యలు: కత్తి మహేశ్‌పై కేసు
x
Highlights

సినీ క్రిటిక్ కత్తి మహేష్‌పై కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రాముడిని దుర్భాషలాడారంటూ హిందూ జనశక్తి నేతలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు...

సినీ క్రిటిక్ కత్తి మహేష్‌పై కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రాముడిని దుర్భాషలాడారంటూ హిందూ జనశక్తి నేతలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ ఛానెల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో భాగంగా కత్తి మహేశ్‌ ఫోన్‌ ఇన్‌లో మాట్లాడుతూ..‘ రామాయణం అనేది నాకొక కథ. రాముడనే వాడు దగుల్బాజీ అని నేను నమ్ముతా.. ఆ కథలో సీత బహుశా రావుణుడితోనే ఉంటే బాగుండేదేమో, ఆవిడకి న్యాయం జరిగి ఉండేదేమో అని నేననుకుంటా’ అంటూ రాముడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో తమ ఆరాధ్యదైవం రాముడిపై కత్తి మహేశ్‌ నోటికి వచ్చినట్టు మాట్లాడటంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో హిందూ జనశక్తి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories