భారీగా పెరిగిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి జీతాలు

భారీగా పెరిగిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి జీతాలు
x
Highlights

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి జీతాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ 2018 సందర్భంగా కేంద్ర ఆర్ధిక మంత్రి జైట్లీ పార్లమెంటులో...

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి జీతాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ 2018 సందర్భంగా కేంద్ర ఆర్ధిక మంత్రి జైట్లీ పార్లమెంటులో ప్రసంగిస్తూ...కొత్త పేస్కేల్ ప్రకారం రాష్ట్రపతికి రూ.5 లక్షలు, ఉపరాష్ట్రపతికి రూ.4.5 లక్షలు, గవర్నర్లకు రూ.3.5 లక్షలుగా నిర్ణయించినట్లు జైట్లీ వెల్లడించారు. వీళ్లతోపాటు ఎంపీల జీతాలు కూడా పెరగనున్నాయి. ఇక ఎంపీల జీతాలు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రతి ఐదేళ్లకోసారి ఆటోమేటిగ్గా పెరిగేలా ఓ చట్టాన్ని తీసుకురానున్నట్లు జైట్లీ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రపతి జీతం రూ.1.5 లక్షలు ఉండగా.. దానిని ఒకేసరి ఐదు లక్షలకు పెంచడం గమనార్హం. ఇక ఉపరాష్ట్రపతి ఇప్పటివరకు రూ.1.25 లక్షలు అందుకుంటుండగా.. ఇక నుంచి రూ.4.5 లక్షలు ఇవ్వనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories