అతిలోక సుందరి గురించి ఎవరికి తెలియని విషయాలతో...

అతిలోకసుందరి మరణించి రెండు వారాలవుతోంది అయినప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో ఆమె స్థానం పదిలంగానే ఉంది....
అతిలోకసుందరి మరణించి రెండు వారాలవుతోంది అయినప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో ఆమె స్థానం పదిలంగానే ఉంది. సినిమాల్లోని ఆమె నటనను జనం మరచిపోలేకపోతున్నారు. అయితే శ్రీదేవి గురించి ఎవరికి తెలియని విషయాలతో డాక్యుమెంటరీ తెరకెక్కించాలని బోనీ కపూర్ ప్లాన్ చేస్తున్నారు.
భారత సినిమా చరిత్రలో శ్రీదేవిది ప్రత్యేక స్థానం. పురుషులతో సమానంగా సూపర్‌స్టార్‌గా స్టార్‌డమ్ సంపదించుకున్నారు శ్రీదేవి. శ్రీదేవి మరణించి 15 రోజులవుతున్నాయ్. శ్రీదేవి మృతిని కుటుంబసభ్యులతో పాటు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో ఆమె నటనను గుర్తు చేసుకుంటున్నారు. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలోనూ నటీనటులు శ్రీదేవికి నివాళులు అర్పించారు.
4 ఏళ్ల వయసులోనే వెండితెరకు పరిచయమైన శ్రీదేవి దాదాపు 50 ఏళ్ల పాటు సినిమాల్లో నటించారు. 260 సినిమాల్లో నటించి తనకు ఎవరు సాటిలేరని నిరూపించారు శ్రీదేవి. ఈ నేపథ్యంలో శ్రీదేవి భర్త బోనీకపూర్ అతిలోక సుందరి గురించి ఎవరికి తెలియని విషయాలతో డాక్యుమెంటరీని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. డాక్యుమెంటరీలో పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఎవరు ఊహించని విషయాలు చూపించనున్నట్లు తెలుస్తోంది.
రూప్ కీ రాణి డాక్యుమెంటరీకి మిస్టర్ ఇండియా దర్శకుడు శేఖర్ కపూర్ తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ డాక్యుమెంటరీలో శ్రీదేవితో సినిమాలు తీసిన దర్శకులు, నిర్మాతలు, కలిసి నటించిన హీరోల అభిప్రాయాలు ఉంటాయని తెలుస్తోంది. శ్రీదేవి డాక్యుమెంటరీ గురించి ఎప్పుడు ప్రకటిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT