నమ్రతకు టెంపర్ ఎక్కువ

నమ్రతకు టెంపర్ ఎక్కువ
x
Highlights

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ పై బాలీవుడ్ నటి మలైకా అరోరా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తాను మోడలింగ్ రంగంలోకి ప్రవేశించేనాటికే...

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ పై బాలీవుడ్ నటి మలైకా అరోరా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తాను మోడలింగ్ రంగంలోకి ప్రవేశించేనాటికే నమ్రత సీనియర్ మోడల్ అని చెప్పింది. ఆమెతో పాటు మరో మోడల్ మెహర్ జెస్సియా కూడా అగ్ర స్థానంలో ఉండేదని తెలిపింది. అయితే సీనియారిటీ కారణంగా వీరిద్దరూ తనతో చాలా పొగరుగా ప్రవర్తించేవారని వ్యాఖ్యానించింది.

నమ్రతకు టెంపర్ ఎక్కువని, మిగతావాళ్ళమీద లెక్కలేనితనం చూపుతుందని మలైకా అరోరా బహిరంగ విమర్శ చేస్తోంది. మోడలింగ్ ఫీల్డ్ లో తామిద్దరం పార్లల్ గా పనిచేశామంటూ.. అప్పట్లో నమ్రత వల్ల తాను పడ్డ ఇబ్బందుల్ని ఏకరువు పెడుతోంది బాలీవుడ్ బ్యూటీ మలైకా. నమ్రత దురుసు ప్రవర్తన తనతో పాటు చాలామందిని ఇరిటేట్ చేసేదన్న మలైకా.. ఇప్పుడు మాత్రం తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ బ్యాలెన్స్ చెయ్యడానికి ట్రై చేసింది.‘వోగ్ బీఎఫ్‌ఎఫ్‌’ కోసం ఒక ఇంటర్వ్యూలో మలైకా చేసిన ఎలిగేషన్స్ ఇవన్నీ. వీటిని ప్రిన్స్ ఫ్యామిలీ ఎంత మేరకు సీరియస్ తీసుకుంటుందో గానీ.. మహేష్ ఫాన్స్ మాత్రం మంటెక్కిపోతున్నారు. ‘మా మేడమ్ కి సర్టిఫికెట్ ఇచ్చేంత సీన్ మలైకా అరోరాకి లేదు’ అంటూ విరుచుకు పడుతోంది ప్రిన్స్ ఫ్యాన్స్ క్లబ్.

Show Full Article
Print Article
Next Story
More Stories