బాల్క సుమన్‌ భార్య ఫొటో మార్ఫింగ్‌ చేశారు

బాల్క సుమన్‌ భార్య ఫొటో మార్ఫింగ్‌ చేశారు
x
Highlights

పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌పై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగుతోందని మంచిర్యాల సీఐ మహేశ్‌ తెలిపారు. ఎంపీకి సంబంధించి వైరల్ అవుతున్న ఫొటోలు...

పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌పై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగుతోందని మంచిర్యాల సీఐ మహేశ్‌ తెలిపారు. ఎంపీకి సంబంధించి వైరల్ అవుతున్న ఫొటోలు మార్ఫింగ్‌ చేసినవని చెప్పారు. బాల్క సుమన్‌ భార్య ఫొటోను మార్ఫింగ్‌ చేసి దుష్ర్పచారం చేశారని తెలిపారు. సుమన్‌ భార్య స్థానంలో సంధ్య అనే అమ్మాయి ఫొటోను జోడించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్నవి తప్పుడు చిత్రాలని పేర్కొన్నారు. ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని సంధ్య, విజిత అనే అక్కాచెల్లెళ్లు బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని సీఐ అన్నారు. ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని సంధ్య, విజిత అనే అక్కాచెల్లెళ్లు బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని సీఐ అన్నారు.

మంచిర్యాలకు చెందిన వీరు ఎనిమిదేళ్లుగా పెద్దపల్లి, గోదావరిఖని, చంద్రాపూర్‌లలో పలువురిని బ్లాక్‌మెయిల్‌ చేశారని చెప్పారు. సంధ్య, విజితలపై జనవరి 27న ఎంపీ బాల్క సుమన్‌ అనుచరులు ఫిర్యాదు చేశారని.. విచారణలో వీరికి సంబంధించి విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఎంపీ తన భార్య, పిల్లలతో ఫేస్‌బుక్‌లో ఉన్న చిత్రాన్ని సంధ్య మార్ఫింగ్‌ చేశారని సీఐ చెప్పారు. పిబ్రవరి 6న సంధ్య, విజితలపై కేసు నమోదు చేశామని.. ప్రస్తుతం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోనూ కేసులు నమోదయ్యాయని తెలిపారు. నిరాధార ఆరోపణలతో బ్లాక్‌ మెయిల్‌ వ్యవహరాలు మానుకోవాలని సీఐ సూచించారు. ఒకవేళ నిజమైన ఆధారాలుంటే.. పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories