logo
జాతీయం

బీజేపీ పాలన బాగుందంటున్న తెలుగు ప్రజలు

Highlights

గుజరాత్‌ ఎన్నికలు అమాంతం వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ...

గుజరాత్‌ ఎన్నికలు అమాంతం వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ మారిపోయింది. లోక్‌ నీతి-సీఎస్ డీఎస్‌-ఏబీపీ కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఓ ఒపీనియన్‌ పోల్‌లో రెండు పార్టీల మధ్య అంతరం 10 సీట్ల లోపే. 182 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీకి 91-99 సీట్లు లభించవచ్చని, కాంగ్రెస్‌కు 78-86 సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది. రెండింటికీ 43% ఓట్లు లభించవచ్చని సర్వే అంచనావేస్తోంది. ఇదే బృందం 4 నెలల కిందట జరిపిన సర్వేలో బీజేపీకి 150 సీట్లు రావొచ్చని, కాంగ్రెస్‌కు 30 మించి వచ్చే ఛాన్స్‌ లేదని అంచనావేసింది. నరేంద్ర మోదీ ప్రభావం ఇప్పటికీ ఉన్నప్పటికీ స్థానిక నాయకత్వం అందుకు తగ్గ స్థాయిలో పైకి లేవలేకపోవడం బీజేపీకి మైనస్‌ అవుతోంది. ఇప్పటికే మొదటి దఫా పోలింగ్‌ ఈ నెల 9 అయిపోగా, 14 తేదీన రెండో దశ పోలింగ్ జరగనుంది. కాగా ఓట్ల ఓట్ల లెక్కింపు ఈనెల 18న జరుగుతుంది.

మరోవైపు గుజరాత్‌లో బీజేపీ పాలన బాగుందని సూరత్‌లోని తెలుగు ప్రజలు చెబుతున్నారు. నోట్ల రద్దు తమను ఇబ్బంది పెట్టినా....భవిష్యత్‌లో మంచి జరుగుతుందోమోనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా బిజేపీకే ఓటు వేస్తున్నామని....ఇప్పుడు కూడా బీజేపీకే ఓటు వేస్తామని అక్కడి తెలుగు ప్రజలు చెప్పుకొస్తున్నారు.

Next Story