సొంతిళ్లు లేనివారికి అద్దె చెల్లిస్తామంటున్న బీజేపీ

సొంతిళ్లు లేనివారికి అద్దె చెల్లిస్తామంటున్న బీజేపీ
x
Highlights

ఢిల్లీ పెద్దలతో ప్రచారం చేయిస్తూ ఊపుమీదున్న కమలం పార్టీ తాజాగా ప్రజలను తమవైపు తిప్పుకునే లక్ష్యంతో మేనిఫెస్టోను విడుదల చేసింది. వివిధ వర్గాల నుంచి...

ఢిల్లీ పెద్దలతో ప్రచారం చేయిస్తూ ఊపుమీదున్న కమలం పార్టీ తాజాగా ప్రజలను తమవైపు తిప్పుకునే లక్ష్యంతో మేనిఫెస్టోను విడుదల చేసింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో మేలవించిన ప్రజా మేనిఫెస్టోను ప్రజల ముందుంచింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌ ల మేనిఫెస్టోలకు ఏమాత్రం తీసిపోకుండా తమ మేనిఫెస్టోను రూపొందించింది.

తెలంగాణలో తమ అస్థిత్వాన్ని మరోసారి నిరూపించుకునేందుకు అధికారమే టార్గెట్‌గా సింగిల్‌గా పోరాడుతున్న భారతీయ జనతా పార్టీ ప్రజా మెనిఫెస్టోను విడుదల చేసింది. ఎన్నికల్లో గెలిస్తే వచ్చే ఐదేళ్లు తమ పరిపాలన ఎలా ఉంటుందో వివరిస్తూ సాగిన మేనిఫెస్టో.. తమకు పట్టం కడుతుందని ఆ పార్టీ నాయకత్వం బలంగా విశ్వసిస్తోంది. సొంతిళ్లు లేనివారికి అద్దెను తామే చెల్లిస్తామని బీజేపీ ప్రధాన హామీగా పేర్కొంది. అలాగే రైతులకు 2 లక్షల రుణమాఫీ, విత్తనాల పంపిణీ, మద్దతు ధర లాంటి అంశాలను తమ మేనిఫెస్టోలో చేర్చారు. ఇటు డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తామని హామీ ఇస్తోంది.

ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తామని సిపిఎస్ విధానం రద్దు, యువతకు ఉపాధి కల్పించడం, జర్నలిస్టుల సంక్షేమం, ప్రజల భద్రత విషయాల్లో రాజీ లేకుండా కృషి చేస్తామని చెప్పుకొచ్చింది. పోలీసులు, హోం గార్డులు, పట్టణాభివృద్ధి, ఐటీ, సింగరేణి, మైనారిటీ సంక్షేమం, దళితుల అభివృద్ధి లాంటి విషయాలను బీజేపీ మేనిఫెస్టోలో చేర్చింది. రజకులను ఎస్సి కేటగిరీలో, వాల్మీకి, బోయ, వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేరుస్తామనే అంశాలు, కుల వృత్తుల వారికి పెన్షన్ లిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది.

పలు రంగాల నిష్ణాతులతో ఏర్పాటైన మేనిఫెస్టో కమిటీ వందలాది మందితో చర్చించి ప్రజా మేనిఫెస్టోని తయారు చేసిందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన టీఆర్ఎస్‌ కన్నా హామీలిచ్చి మర్చిపోయే కాంగ్రెస్‌ కన్నా తాము ఎంతో బెటర్ అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు తమ ప్రజా మేనిఫెస్టో ఎంతో ఉపయోగకరంగా మారుతుందని ఈ సారి ప్రజలు తమకే పట్టం కడతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories