Top
logo

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు మగతనం లేదు

X
Highlights

బెల్లంపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.. బెదిరింపుల వ్యవహారంపై బీజేపీ జాతీయనేత రాంమాధవ్ సైటెర్లు...

బెల్లంపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.. బెదిరింపుల వ్యవహారంపై బీజేపీ జాతీయనేత రాంమాధవ్ సైటెర్లు వేశారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మగతనం లేనివారంటూ రాంమాధవ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పేరు చెప్పి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆడకూతుళ్లను బెదిరించడమేంటని ప్రశ్నించారు. కౌన్సిలర్‌ కూతుర్ని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఒకరు బెదిరించి నీచ సంస్కృతిని చాటుకున్నారని ఆరోపించారు. ‘మీ నాన్న మా మాట వినకుంటే బాగోదు’ అంటూ ఆ కౌన్సిలర్‌ కూతుర్ని గెస్ట్‌హౌస్ లో బెదిరిస్తుంటే.. ఆ ఆడబిడ్డ ‘అలాగే అంకుల్‌’ అనడాన్ని చూసి చలించిపోయానన్నారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలనకు ఇది నిదర్శనమని చెప్పారు. బీజేపీ జనచైతన్య యాత్ర గురువారం వరంగల్‌కు చేరుకున్న సందర్భంగా హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాంమాధవ్‌ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌పై, సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసి శాలువా, పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఫొటోలు దిగుతారని, తెలంగాణలో దిగగానే మజ్లి్‌సకు జీ హుజూర్‌ అంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ తమకు మిత్రపక్షం కాదని, శత్రువేనని స్పష్టం చేశారు.

Next Story