కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత..కిషన్‌రెడ్డితో సహా బీజేపీ నేతలు అరెస్ట్

x
Highlights

కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించిన బీజేపీ నేతలను పోలీసులు...

కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసులు, బీజేపీ మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కిషన్‌రెడ్డితో పాటు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

కలెక్టరేట్ వద్ద జరిగిన బీజేపీ ముట్టడి కార్యక్రమంలో ఇసుక మాఫియాకు బలైన వీఆర్ఎ సాయిలు కుటుంబసభ్యులు పాల్గొన్నారు. సాయిలు భార్య, కొడుకు, తండ్రి ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఇసుక మాఫియాను ఆరికట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వాహనం ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు.

ప్రత్యేక రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణగా మారుతుందనుకుంటే మాఫియా తెలంగాణగా మారిందని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి ఆరోపించారు. నాడు తెలంగాణను అడ్డుకున్న వారే నేడు ప్రగతి భవన్‌లో పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక,లిక్కర్,ల్యాండ్, డ్రగ్స్‌ మాఫియా తెలంగాణలో రాజ్యమేలుతున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారు జైలుకు వెళ్తుంటే ఉద్యమాన్ని అడ్డుకున్న వారు రాజ్యమేలుతున్నారని కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories