logo
జాతీయం

పార్టీ మారితే.. రూ.30 కోట్ల ఆఫర్‌

పార్టీ మారితే.. రూ.30 కోట్ల ఆఫర్‌
X
Highlights

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే, కేపీసీసీ మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మీ హెబ్బాళ్కర్‌ సంచలన ఆరోపణలు చేశారు....

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే, కేపీసీసీ మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మీ హెబ్బాళ్కర్‌ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ నుంచి తనకు బ్రహ్మాండమైన ఆఫర్ వచ్చిందని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. తమ పార్టీలోకి వస్తే రూ.30 కోట్లు ఇస్తామని బీజేపీ నేతలు తన సెల్‌ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌లు పంపారని తెలిపారు. అంతేకాకుండా బీజేపీ అధికారంలోకి రాగానే మంత్రి పదవి ఇస్తామని చెప్పారని లక్ష్మి హెబ్బాల్కర్‌ అన్నారు. ఈ ఆఫర్‌కు సంబంధించి తన సెల్‌ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌లు పంపారని, ఈ విషయాన్ని రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఆపరేషన్‌ కమలం చేపట్టడం అనైతికమని, వారిచ్చిన ఆఫర్‌ను తిరస్కరించానని తెలిపారు. అయితే తనతో సంప్రదింపులు జరిపిన నేతల పేర్లు మాత్రం బయటపెట్టలేదు.

Next Story