logo
జాతీయం

రజ‌నీ పార్టీలో బీజేపీ నేత..అప్ర‌మ‌త్త‌మైన ఇత‌ర పార్టీ నేత‌లు

రజ‌నీ పార్టీలో బీజేపీ నేత..అప్ర‌మ‌త్త‌మైన ఇత‌ర పార్టీ నేత‌లు
X
Highlights

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో ప్ర‌పంచ...

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఆయ‌న అభిమానులు, ల‌క్ష‌మంది అభిమాన సంఘాలు , ట్విట్టర్లో 44 లక్షల మంది ఫాలోవ‌ర్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు. మ‌రోవైపు రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారో లేదో ఆయ‌న‌తో ప‌నిచేసేందుకు ఇత‌ర పార్టీకి చెందిన నేత‌లు ఉవ్విళ్లూరుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో రజినీ పెట్టబోయే పార్టీలో తానూ చేరతానని తిరువళ్లూరు బీజేపీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఎస్‌వి సెల్వరాజు ప్రకటించారు. దీంతో షాక్ తిన్న బీజేపీ నేత‌లు సెల్వ‌రాజ్ పార్టీ మార‌డాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇన్నీరోజులు త‌మ‌వెంటే ఉన్న సెల్వ‌రాజు ర‌జ‌నీ కాంత్ పార్టీలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో వారు నిరుత్సాహానికిగుర‌య్యారు. అయితే సెల్వ‌రాజ్ ప్ర‌క‌ట‌న‌తో త‌మిళ‌నాడుకు చెందిన ఇత‌ర పార్టీల అధినేత‌లు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. కేడ‌ర్ చేజారిపోకుండా ఉండేలా క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

Next Story