కేసీఆర్‌పై బీజేపీ అస్త్రం...పోటీకి యంగ్‌ లీడర్‌...

కేసీఆర్‌పై బీజేపీ అస్త్రం...పోటీకి యంగ్‌ లీడర్‌...
x
Highlights

తెలంగాణలో బీజేపీ రూట్ మార్చిందా ? అధికారం కంటే సంచలన విజయాలపైనే దృష్టి సారించిందా ? ఏకంగా సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా కమలనాధులు పావులు కదుపుతున్నారా ? ...

తెలంగాణలో బీజేపీ రూట్ మార్చిందా ? అధికారం కంటే సంచలన విజయాలపైనే దృష్టి సారించిందా ? ఏకంగా సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా కమలనాధులు పావులు కదుపుతున్నారా ? గజ్వేల్‌ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా కొత్త వ్యూహాలకు పదును పెట్టారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం సీఎం కేసీఆర్‌కు నిన్న మొన్నటి వరకు నమ్మిన నేస్తంగా ఉన్న మాజీ పీసీసీ చీఫ్ డీఎస్ కుమారుడు ధర్మిపురి అరవింద్‌ను బరిలోకి దింపాలని నిర్ణయించినట్టు సమాచారం.

తండ్రి డీఎస్‌ టీఆర్ఎస్‌లో కీలక స్ధానంలో ఉన్నా ఆయనతో సంబంధం లేకుండా ధర్మపురి అరవింద్ బీజేపీలో చేరారు. తొలి నుంచి నిజామాబాద్ పార్లమెంట్ ‌సీటు పైనే దృష్టి సారించారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి సీఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ గెలుపే లక్ష్యంగా గత మూడేళ్ల నుంచి కేడర్‌ను సిద్ధం చేశారు. అయితే ముందస్తు ఎన్నికలు రావడంతో ధర్మపురి అరవింద్‌ సేవలను గజ్వేల్‌లో వినియోగించుకోవాలని రాష్ట్ర నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

గజ్వేల్‌ నియోజకవర్గంలో ధర్మపురి అరవింద్‌కు ఓ సామాజిక వర్గం మద్దతు బలంగా ఉండటం, ఆర్ఎస్‌ఎస్‌ కేడర్‌ బలమైన స్ధాయిలో ఉండటం, కర్నాటక సరిహద్దుల్లోని ప్రత్యేక పరిస్ధితులు కలిసి వస్తాయని బీజేపీ రాష్ట్ర నాయకత్వం లెక్కలు కూడా వేసింది. కేసీఆర్‌పై పోటీ చేసేందుకు ఇప్పటి వరకు పార్టీ తరపున ఎవరూ ఆసక్తి చూపలేదు. పోటీ చేసినా గౌరవ ప్రదమైన ఓట్లు కూడా రావంటూ కొందరు వెనకడగు వేశారు. ఈ నేపథ్యంలోనే ధర్మపురి అరవింద్‌ను బరిలోకి దింపాలని అగ్రనేతలు నిర్ణయించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ధర్మపురి అర్వింద్ కోసం ఇప్పటికే క్యాంప్ కార్యాలయాన్ని సిద్ధం చేసిన పార్టీ నేతలు నియోజకవర్గంలోని కార్యకర్తలు, మద్ధతుదార్లను ఏకం చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. అర్వింద్‌కు మద్ధతుగా సీనియర్ నేతలు సైతం ప్రచారానికి వస్తామని హామీ ఇవ్వడంతో గజ్వేల్‌లో ఎన్నికలు ఆసక్తిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories