టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లను తరిమికొట్టాలి: అమిత్ షా

టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లను తరిమికొట్టాలి: అమిత్ షా
x
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం కీలకదశకు చేరుకోవడంతో భాజపా అగ్రనేతలు రాష్ట్రానికి వరుస కడుతున్నారు. నారాయణపేట్‌ బహిరంగ సభలో బీజేపీ జాతీయ...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం కీలకదశకు చేరుకోవడంతో భాజపా అగ్రనేతలు రాష్ట్రానికి వరుస కడుతున్నారు. నారాయణపేట్‌ బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం బీజేపీనే గెలిపించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కోరారు. రాష్ట్రంలో ముక్కోణపు పోరు జరుగుతుందని అన్నారు. మజ్లిస్‌తో అంటకాగిన టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మజ్లిస్‌కు భయపడే తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదన్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు దేశంలో అవకాశం లేదన్న అమిత్ షా వ్యాఖ్యనించారు. నారాయణపేట్‌ అభివృద్ధి కావాలంటే కమలం గుర్తుకే ఓటెయ్యాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories