దారుణం : అద్దెకు భార్యలు!

దేశంలోని పలు రాష్ట్రాల్లో పలు రకాలైన సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి జిల్లాలోని ...
దేశంలోని పలు రాష్ట్రాల్లో పలు రకాలైన సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి జిల్లాలోని దధీచ ప్రాత అనే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఈ ఆచారం ప్రకారంగా తన భార్యను ఇతర వ్యక్తులకు భర్త విక్రయించుకొనే వెసులు బాటు ఉంది. స్టాంపు పేపర్‌పై ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదుర్చుకొంటే సరిపోతోంది. ఈ ఒప్పందంలో భార్యను విక్రయించిన భర్తకు ఎంత ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తే అంత ఎక్కువ కాలం కొనుగోలుదారుడి వద్ద ఉంచుకొనే వెసులుబాటు ఉంటుంది. ఈ ఒప్పందాన్ని అధికారికంగా నిర్ధారించడానికి రూ.10 నుంచి రూ.100 వరకూ ఉన్న స్టాంపు పేపర్లపై ఇరు వర్గాలు సంతకం చేస్తాయి. ఎంత ఎక్కువ ధర పలికితే, అంత ఎక్కువ కాలం ఆ బంధం నిలిచివుంటుంది. ఒప్పందం కాలం అయిపోయాక తిరిగొచ్చిన స్త్రీ మరొక వ్యక్తి కోసం బేరంలో నిలబెడతారు.
గుజరాత్‌కు చెందిన ఓ నిరుపేద వ్యక్తి తన భార్యను ఒక పటేల్ ఇంట్లో నెలకి 8000 రూపాయల అద్దె భార్యగా పంపాడు. మెహ్సానా, పతన్, రాజకోట్, గాంధీనగర్ వంటి జిల్లాల్లో పిల్లలని కనలేని స్త్రీలు, పేద కుటుంబాల వారికి డబ్బు ఎరగా వేసి ఈ దారుణాలకు ఒడిగడుతున్నారు. అటవీ ప్రాంతంలో ఉండే గిరిజన యువతులకు రూ.500 నుంచి రూ.60000 ఇచ్చే విధంగా మధ్యవర్తులు బేరం ఆడతారు. అనంతరం వారికి ఇచ్చే డబ్బులో మధ్యవర్తులు కమీషన్లు వసూలు చేసుకుంటారు. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కో వ్యక్తి నెలకి రూ.1.5 లక్ష నుంచి 2 లక్షల వరకూ సంపాదిస్తాడు. ఎవరూ ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపోవడంతో ఆ జిల్లాల పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు.
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
Bigg Boss 6 Telugu: అప్పగింతల కాన్సెప్ట్‌తో 'బిగ్‌బాస్' ప్రోమో.....
9 Aug 2022 10:00 AM GMTCash Deposit: ఈ 2 పత్రాలు లేకుండా మనీ డిపాజిట్ కష్టమే.. ఎందుకంటే..?
9 Aug 2022 9:15 AM GMTఎపిక్ ప్రేమ కథ అంటే అది అని రాధాకృష్ణ ని ట్రోల్ చేస్తున్న ప్రభాస్...
9 Aug 2022 8:30 AM GMTభద్రాద్రి జిల్లా పాల్వంచలో దొంగల హల్చల్
9 Aug 2022 8:29 AM GMTJayasudha: బీజేపీలోకి సినీనటి జయసుధ...?
9 Aug 2022 8:03 AM GMT