logo
జాతీయం

సీఎంగా భూపేష్‌ భగేల్‌ ప్రమాణస్వీకారం

సీఎంగా భూపేష్‌ భగేల్‌ ప్రమాణస్వీకారం
X
Highlights

ఛత్తీస్ గడ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత భూపెశ్ భగేల్ ప్రమాణస్వీకారం 4గంటలకు జరగవల్సిన కార్యక్రమం వర్షం కారణంగా ...

ఛత్తీస్ గడ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత భూపెశ్ భగేల్ ప్రమాణస్వీకారం 4గంటలకు జరగవల్సిన కార్యక్రమం వర్షం కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా ఎట్టకేలకు బల్బీర్‌ జునేజా ఇండోర్‌ స్టేడియంలో భూపేష్‌ భగేల్‌ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఆనందిబెన్ పటేల్ భూపేష్‌ చే ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు పాల్గోన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో 15 ఏళ్ల బీజేపీ పాలనకు చరమగీతం పాడటంలో భూపేశ్‌ భగేల్‌ కీలక పాత్ర వహించారు.

Next Story