shooting-colorado

Highlights

న్యూయార్క్‌లో జరిగిన ఉగ్రదాడి నుంచి తేరుకోకముందే అమెరికాలోని కొలరాడో ప్రాంతంలో మరో ఘటనచోటుచేసుకుంది. భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం కొలరాడొ రాష్ట్రం...

న్యూయార్క్‌లో జరిగిన ఉగ్రదాడి నుంచి తేరుకోకముందే అమెరికాలోని కొలరాడో ప్రాంతంలో మరో ఘటనచోటుచేసుకుంది. భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం కొలరాడొ రాష్ట్రం థోర్న్‌టన్‌ నగరంలోని వాల్‌మార్ట్‌ స్టోర్‌లోకి ఓ దుండగుడు చొరబడి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ మహిళను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది.

ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. మాల్‌ చుట్టుపక్కలకు వెళ్లొద్దని స్థానికులకు సూచించారు. పరిస్థితి తమకూ సరిగ్గా తెలియటం లేదని.. చాలా మందికి గాయాలైనట్లు ఓ అధికారి వ్యాఖ్యానించారు. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. దుండగుడు స్టోర్‌లోకి చొరబడి 30 రౌండ్లు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

న్యూయార్క్‌ నగరంలో ఓ దుండగుడు నిన్న ట్రక్కుతో బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందగా మరో 11 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ దాడి జరిగిన మరుసటి రోజే మరో ఘటన చోటుచేసుకోవడంతో అమెరికా వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories