logo
సినిమా

భానుప్రియ జీవితంలో ఊహించని విషాదం..

భానుప్రియ జీవితంలో ఊహించని విషాదం..
X
Highlights

ఒకప్పటి అందాల నటి భానుప్రియ జీవితంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఆమె మాజీ భర్త ఆదర్శ్ కౌశల్ గుండెపోటుతో...

ఒకప్పటి అందాల నటి భానుప్రియ జీవితంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఆమె మాజీ భర్త ఆదర్శ్ కౌశల్ గుండెపోటుతో అమెరికాలో మృతిచెందారు. కౌశల్ మృతి వార్త విని భానుప్రియ షాక్‌కు గురైనట్లు సమాచారం. ఆ వెంటనే కుమార్తెను తీసుకుని ఆమె అమెరికా బయలుదేరి వెళ్లారు. 1998 జూన్ లో అమెరికాలోని కాలిఫోర్నియాలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వీరి వివాహం జర‌గ‌గా, 2005లో వీరిరివురు మ‌న‌స్ప‌ర్ధ‌ల వ‌ల‌న విడిపోయారు. భాను ప్రియ‌, ఆద‌ర్శ్ దంప‌తుల‌కి 2003లో పాప జ‌న్మించింది. ఆమెకి అభిన‌య అని పేరు పెట్టుకున్నారు. వృత్తిపరంగా ఆదర్శ్ కౌశల్ ఒక ఫోటోగ్రాఫర్. భ‌ర్త‌తో విడాకుల త‌ర్వాత కూతురుతో పాటు ఇండియాకి వ‌చ్చింది భాను ప్రియ‌. ప్ర‌స్తుతం చెన్నైలో ఉంటున్న భాను ప్రియ ప‌లు తెలుగు, త‌మిళ సినిమాల‌లో స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ చేస్తుంది. కూచిపూడి, భరతనాట్యం వంటి కళానృత్యాల్లో చాలామందికి శిక్షణ ఇస్తున్నారు భానుప్రియ‌.

భానుప్రియ ఇంట్లో విషాదం

Related image

Next Story