Top
logo

తెలంగాణలో మొదలైన ఎన్నికల బెట్టింగ్‌

తెలంగాణలో మొదలైన ఎన్నికల బెట్టింగ్‌
X
Highlights

అన్ని పార్టీలలో అభ్యర్ధుల ఖరారు కాకాముందే అప్పుడే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బెట్టింగ్‌ల జోరందుకుంది....

అన్ని పార్టీలలో అభ్యర్ధుల ఖరారు కాకాముందే అప్పుడే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బెట్టింగ్‌ల జోరందుకుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు, అభిమానుల మధ్య జోరుగాబెట్టింగ్‌లు మొదలైనయి.సుద్దాల, క్యాతన్‌పల్లి గ్రామాల్లో ఇరు పార్టీలకు చెందిన మాజీ సర్పంచ్‌లు పందెం పెట్టుకున్నారు. కాగా చెన్నూరులో టీఆర్ఎస్‌ అభ్యర్థి బాల్కసుమన్‌పై కాంగ్రెస్ నేత వెంకటేశ్ ఎమ్మెల్యేగా గెలుస్తారని సుద్దాల మాజీ సర్పంచ్ పోలు చంద్రాగౌడ్ రూ.పది వేల బెట్ కట్టాడు. కాంగ్రెస్‌ బెట్టింగ్‌ను టీఆర్ఎస్‌కు చెందిన క్యాతన్‌పల్లి మాజీ సర్పంచ్ లింగయ్య సవాల్ చేస్తూ బాల్కసుమన్ బ్రహ్మండమైన విజయం సాదించడం ఖాయమని రూ.10వేల బెట్ కట్టారు. కాగా ఎన్నికల ఫలితాలు వచ్చాక ఓడిన వారు గెలిచిన వారికి రూ.10వేలు ఇవ్వాలని గ్రామస్థుల సమక్షంలోనే ఒప్పందం పత్రం రాసుకున్నారు.కాంగ్రెస్ నేటి వరకు అభ్యర్థులను ప్రకటించనే లేదు, మహాకూటమి సీట్ల పంచాయతీ తేలనేలేదు. అయినా చెన్నూరులో నిలబడేది వెంకటేశ్ అంటూ బెట్టింగ్ కట్టేశారు. ఫైనల్‌గా బెట్టింగ్ సంసారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పందెం కాసిన మాజీ సర్పంచ్‌లు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Next Story