Top
logo

అడ్డంగా బుక్కైన బేగంపేట్‌ ఏసీపీ

అడ్డంగా బుక్కైన బేగంపేట్‌ ఏసీపీ
X
Highlights

నగలు కొంటామంటూ ఓ ఆభరణాల షాపునకు వచ్చి కిలో వెండి ఆభరణాలను దొంగతనం చేసిన కేసులో నిందితులను మీడియా ముందు హాజరు...

నగలు కొంటామంటూ ఓ ఆభరణాల షాపునకు వచ్చి కిలో వెండి ఆభరణాలను దొంగతనం చేసిన కేసులో నిందితులను మీడియా ముందు హాజరు పరిచిన వేళ, హైదరాబాద్, బేగంపేట్‌ ఏసీపీ రంగారావు ప్రవర్తించిన తీరు వివాదాస్పదం కాగా, జాతీయ మీడియాలో సైతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ముగ్గురు మహిళలతో పాటు దొంగతనం చేసిన సొమ్మును విక్రయిస్తూ పట్టుబడిన మహిళను పోలీసులు అరెస్ట్ చేసిన పోలీసులు, వారిని మీడియాకు చూపించారు.

ఈ నెల 9వ తేదీన బొల్లారం పయొనీర్‌ బజార్‌లోని ఓ జ్యువెల్లరీ షాపులో దొంగతనం చోటు చేసుకుంది. కేసుకు సంబంధించి ముగ్గురు మహిళలను, దొంగసొత్తును అమ్ముతున్న మరో మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఆపై జర్నలిస్టుల ముందే ఏసీపీ రంగరావు మహిళ దొంగపై చెయ్యి చేసుకున్నారు. ఈ వీడియో మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఉన్నతాధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.

Next Story