Top
logo

భారత క్రికెటర్లకు త్వరలో ఊరట

Highlights

ఏడాదికి 140 రోజుల అంతర్జాతీయ క్రికెట్ తో సతమతమైపోతున్న టీమిండియా క్రికెటర్లకు త్వరలో ఊరటకల్పించాలని బీసీసీఐ...

ఏడాదికి 140 రోజుల అంతర్జాతీయ క్రికెట్ తో సతమతమైపోతున్న టీమిండియా క్రికెటర్లకు త్వరలో ఊరటకల్పించాలని బీసీసీఐ పాలకమండలి నిర్ణయించింది. నాన్ స్టాప్ క్రికెట్ తో నలిగిపోతున్నామంటూ కెప్టెన్ విరాట్ కొహ్లీ ఇటీవలే గగ్గోలు పెట్టిన నేపథ్యంలో బీసీసీఐ పాలకమండలి చైర్మన్ వినోద్ రాయ్ చర్యలు తీసుకోడానికి నడుంబిగించారు. 2019 నుంచి 2023 సీజన్ వరకూ కార్యక్రమాన్ని ఖరారు చేసే ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాం సుప్రీంకోర్టు నిర్ణయించిన కమిటీ పర్యవేక్షణలో ఖరారు కానుంది. ఆదాయం కోసం బంగారుబాతులులాంటి క్రికెటర్లను ఇక ఇబ్బంది పెట్టబోమని ఏడాదికి 80 రోజులు మాత్రమే టీమిండియా క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ల్లో పాల్గొనేలా చూస్తామని వినోద్ రాయ్ ప్రకటించారు.

Next Story