ఇవాళ బతుకమ్మ చీరల పంపిణీ

ఇవాళ బతుకమ్మ చీరల పంపిణీ
x
Highlights

బతుకమ్మ చీరల పంపిణీకి ‘ఎన్నికల గ్రహణం’ వీడింది. కోడ్‌ ముగియడంతో చీరల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా...

బతుకమ్మ చీరల పంపిణీకి ‘ఎన్నికల గ్రహణం’ వీడింది. కోడ్‌ ముగియడంతో చీరల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టనున్నారు. బతుకమ్మ పండగకు చీరలను అందించాల్సి ఉన్నప్పటికీ శాసనసభ రద్దు ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో పంపిణీ నిలిపివేశారు. సంక్రాంతి పండుగకు ముందైనా అందజేయాలని సర్కార్ నిర్ణయించింది.

ఎట్టకేలకు బతుకమ్మ చీరల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. బతుకమ్మ పండుగకు ముందే చీరల పంపిణీకి సిద్ధం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో అప్పట్లో నిలిపి వేశారు. బుధవారం నుంచి చీరల పంపిణీ చేయాలని ఆదేశాలు జారీచేసింది సర్కార్. చేనేత జౌళిశాఖ, రెవెన్యూ శాఖల సమన్వయంతో చీరల పంపిణీ చేపట్టనున్నారు.

తెలంగాణలో మరోసారి కొలువుదీరిన టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించడంతో చేనత కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. సిరిసిల్ల మరమగ్గాలపై ప్రభుత్వం 94 లక్షల చీరలను ఉత్పత్తి చేయించారు. ఇందు కోసం రూ.280 కోట్లు కేటాయించింది. ఆధార్‌, రేషన్‌కార్డు, లేదా ఏదైనా ఫొటో కలిగి ఉన్న గుర్తింపు కార్డును చూపించి లబ్ధిదారులు చీరలు తీసుకెళ్లాల్సి ఉంటుంది. వారం పాటు చీరల పంపిణీ చేపడతారు.

ప్రతి గ్రామంలో రేషన్‌ డీలర్‌, వీఆర్‌ఓ, మహిళా సంఘం ప్రతినిధితో కూడిన కమిటీ సమక్షంలో చీరలు పంపిణీ చేయనున్నారు. మొదటి రోజు స్థానిక ఎమ్మెల్యే లేద ఎమ్మెల్సీ, ఎంపీ, జడ్పీ ఛైర్‌పర్సన్‌, స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలోనే పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. సంబంధిత లబ్ధిదారులు ఎవరైనా స్థానికంగా లేకుంటే.. మహిళకు సంబంధించిన కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒక్కరి గుర్తింపు కార్డు చూపిస్తే వారికి అందజేస్తామని అధికారులు తెలిపారు. అన్ని గ్రామాల ప్రజలకు ఇప్పటికే సమాచారాన్నిచ్చారు. చీరల పంపిణీపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గ్రామాల్లో ప్రజలు ఆనందం వ్యక్తం అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories