24 ఫ్లోర్ల బిల్డింగ్ నుంచి దూకి బతికి బట్ట కట్టాడు

x
Highlights

సాధారణంగా ఓ నాలుగైదు ఫ్లోర్ల బిల్డింగ్ పైనుంచి కిందికి చూస్తేనే కండ్లు తిరుగుతాయి. కాని.. ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 24 ఫ్లోర్ల బిల్డింగ్ నుంచి దూకి బతికి...

సాధారణంగా ఓ నాలుగైదు ఫ్లోర్ల బిల్డింగ్ పైనుంచి కిందికి చూస్తేనే కండ్లు తిరుగుతాయి. కాని.. ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 24 ఫ్లోర్ల బిల్డింగ్ నుంచి దూకి బతికి బట్ట కట్టాడు. కాకపోతే తీవ్రగాయాలతో బయటపడ్డాడు. అసలు 24వ అంతస్థు నుంచి ఎందుకు దూకాలి. ఏంటా కథ అనేగా మీ డౌట్. స్వీడన్ క్యాపిటల్ స్టాక్‌హోమ్. అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్‌ల మీది నుంచి దూకడం కొత్తేం కాదు. అదో స్టంట్. అంతే. అలా చాలామంది స్టంట్స్ చేస్తూ అక్కడి జనాలను అలరిస్తుంటారు. కాకపోతే.. బిల్డింగ్ మీది నుంచి ఊరికే అలా దూకేయరు. పారాచూట్ సహాయంతో కిందికి దూకుతారు. వాళ్లు దూకగానే పారాచూట్ ఓపెన్ అవుతుంది. దీంతో వాళ్లు సేఫ్‌గా లాండ్ అవుతారు. దీన్నే బేస్ జంపింగ్ అని అంటారు. స్వీడన్‌లో ఇది చట్టబద్ధమైనదే. కాకపోతే.. ముందుగా అనుమతి తీసుకొని ఈ స్టంట్ నిర్వహించాల్సి ఉంటుంది.

ఒక జంపర్... పారాచూట్ ధరించి 24వ అంతస్థు నుంచి దూకుదామనుకున్నాడు. బిల్డింగ్ కింద నుంచి అతని స్నేహితుడు దీనిని కెమెరాలో బంధించాలనుకున్నాడు. ప్లానింగ్ అంతా బాగానే ఉన్నప్పటికీ అది సవ్యంగా అమలుకాలేదు. దీంతో చావు తప్పి కన్నులొట్టపోయినంతపనైంది. జంపర్ బిల్డింగ్‌పైనుంచి పారాచూట్‌పై నమ్మకంతో కిందకు దూకేశాడు. అయితే సమయానికి పారాచూట్ విచ్చుకోలేదు. దీంతో జంపర్ అమాంతం కింద పడిపోయాడు. దీనిని గమనించిన అతని స్నేహితుడు... తీవ్రంగా గాయపడిన జంపర్ ను ఆసుపత్రికి తరలించాడు. అతని అదృష్టం బాగుండి అంత ఎత్తునుంచి పడినప్పటికీ ప్రాణహాని జరగలేదు. ప్రస్తుతం అతనికి వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories