logo
సినిమా

ఓన్లీ బాలయ్య

ఓన్లీ బాలయ్య
X
Highlights

డైలాగులు కొట్టాలన్నా..దడ పుట్టించాలన్నా నందమూరి నటసింహం బాలకృష్ణ తర్వాతే ఎవరైనా. బాలయ్య డైలాగులే...

డైలాగులు కొట్టాలన్నా..దడ పుట్టించాలన్నా నందమూరి నటసింహం బాలకృష్ణ తర్వాతే ఎవరైనా. బాలయ్య డైలాగులే కాదు..సినిమాల్లో చేసే విన్యాసాలు కూడా ఓ రేంజ్ లో ఉంటాయి. తొడ కొట్టి ట్రైన్ ని వెనక్కి నడిపించినా..ప్యారాచూట్ తో పాకిస్తాన్ బార్డర్ దాటినా..అది బాలయ్య ఒక్కడికే సాధ్యమవుతుంది. అందుకే ఆడియన్స్ అవాక్కయ్యేలా స్టంట్లు చేయడంలో..బాలయ్య వన్ అండ్ ఓన్లీ అనిపించుకున్నాడు.
పంచ్ పడితే పది మందైనా గాల్లో ఎగరాల్సిందే..అది బాలయ్య పంచ్ లో ఉన్న పవర్. బరిలో దిగాడంటే దబిడి దిబిడే. ఎటుపక్క నుంచి మొదలై ఎటుపక్కన ఎండ్ అవుతుందో ఎవరికీ తెలియదు. సుడిగాలిలా వచ్చి తుఫాను సృష్టిస్తాడు. ఏ హీరోకి సెట్ కాని ఫైట్స్..వన్ అండ్ ఓన్లీ బాలయ్యకి మాత్రమే సూట్ అవుతాయి.

బాలయ్య డైలాగ్ చెబితే..ప్రత్యర్థి వణికిపోతాడు. తనతో సై అంటే సెకనుకొక హెడ్డు తీసుకెళ్తాడు. తొడగొట్టాలన్నా..పడగొట్టాలన్నా బాలయ్యకి బాలయ్యే సాటి. సాధ్యమా..అసాధ్యమా అనేది నెక్స్ట్..బాలకృష్ణ తొడగొడితే ఏకంగా ట్రైన్ కూడా వెనక్కివెళ్లిపోతుందంతే. ఎంత పవర్ ఫుల్ విలన్ అయినా సరే..బాలకృష్ణ దూకుడు ముందు అస్సలు నిలబడలేడు. తనకు అడ్డొస్తే..ఎంతటి వాళ్లనైనా ఎదురించినిలబడతాడు. అది మనిషైనా సరే..లేకపోతే పెద్ద విమానమైనా సరే..అస్సలు జంకడు. అందరు హీరోల్లా..సినిమాల్లో బాలకృష్ణ ఎంట్రీ సాదాసీదాగా ఉండదు. ఎప్పుడు..ఎక్కడి నుంచి..ఎలా వస్తాడో తెలియదు. గాల్లో నుంచైనా రావచ్చు..నీటిలో నుంచైనా రావచ్చు. బాలయ్య రూటే సెపరేటు. అందుకే సినిమాల్లో ఎవరికీ సాధ్యం కానీ విన్యాసాలు చేస్తాడు.

సినిమాల్లో బాలయ్యతో పోటీ పెట్టుకుంటే మాత్రం..ఎవరైనా సరే మట్టికరవాల్సిందే. దెబ్బకు దెబ్బ తీయకుండా అస్సలు వదిలిపెట్టడు నటసింహం. ప్రత్యర్థి ఎలా తప్పించుకోవాలనుకున్నా ఛాన్స్ ఇవ్వడు. విలన్ ని మట్టుబెట్టడానికి అవసరమైతే ట్రైన్ ని బైక్ తో చేజ్ చేస్తాడు..సాధారణంగా ప్రతి సినిమాలో విలన్ రెచ్చిపోతుంటాడు. ఏ సినిమాలో అయినా హీరోకి, విలన్ కి సమానంగా స్కోపుంటుంది. కానీ బాలకృష్ణ సినిమాల్లో మాత్రం..బాలయ్య ఎంట్రీ ఇవ్వనంతవరకే విలనిజం కనిపిస్తుంది. వన్స్ లెజెండ్ అడుగుపెట్టాడంటే..ఆ తర్వాత వార్ వన్ సైడ్ అయిపోతుంది.

ఓ పెద్ద బిల్డింగ్ మీది నుంచి కిందికి దూకాలంటే..హాలివుడ్ సినిమాల్లో లాగా భారీ విజువల్ ఎఫెక్ట్స్ అవసరం లేదు. పెద్ద పెద్ద క్రేన్స్ అసలే అవసరం లేదు. కాళ్లకు దెబ్బతగలకుండా రెండు తలగడలు అడ్డుపెట్టుకుంటే చాలు. ఎంత ఎత్తునుంచైనా దూకేయొచ్చు. ఇలాంటి సాహసం మామూలు మనుషులు మాత్రం చేయలేరు..అది ఒక్క బాలయ్యకే సాధ్యం. కొండలెక్కాలంటే ట్రెక్కింగ్ లో అనుభవం ఉండాలి. భారీ పర్వాతాలను అధిరోహించాలంటే..ఎంతో గుండె ధైర్యం కావాలి. మొత్తానికి అంతటి సాహసం చేయాలంటే ఏదో ఒక పెద్ద కారణమైతే ఉండాలి. కానీ కేవలం ఓ చిన్న కుందేలు పిల్ల కోసం మాత్రం ఎవ్వరూ ఇంత భారీ సాహసం చేయరు. ఒక్క బాలయ్య తప్ప.

ఒక్కసారి బరిలోకి దిగాడంటే నో మోర్ ఆర్గిమెంట్స్. అడ్డొచ్చిన వాడు ఎంత తోపైనా సరే..గూబ గుయ్యిమనాల్సిందే. బాలయ్యవి ఫైటింగులు కావు.. విన్యాసాలు. అందుకే అవి మామూలుగా ఉండవు. ఒక్కసారి స్క్రీన్ పై వార్ మొదలైతే..మధ్యలో ఏమైనా జరగొచ్చు. బ్యాటుతో బంతిని బాదినట్లు బాదితే..ప్రత్యర్థులు గాళ్లో ఎగిరిపడుతుంటారు. బాలయ్యకి కోపం వస్తే ఆపడం ఎవ్వరి తరం కాదు. గొడవల్లో గోల్డ్ మెడల్ విన్నర్ బాలకృష్ణ. ప్రత్యర్థి ఛాలెంజ్ చేశాడంటే..పెద్ద జీపునైనా సరే ఒంటి చేత్తో పైకెత్తేస్తాడు. వద్దు వద్దు అనేదాకా వాయించివదిలేస్తాడు. అవతలివాడికి అలుపొస్తుందేమో కానీ..కొడుతుంటే బాలయ్యకి ఇంకా ఊపొస్తుంది. రైటా..రాంగా..సెంటరా..స్టేటా..అధికారంలో ఉన్నా..అపోజిషన్లో ఉన్నా..బాలయ్య దిగనంతవరకే. వన్స్ హీ స్టెప్ ఇన్..హిస్టరీ రిపీట్. అందుకే ఫైటింగులయినా..డైలాగులైనా..బాలయ్య చేసినట్లు ఎవ్వరూ చేయలేరు.

Next Story