logo
వ్యాపారం

Bajaj FinServ అందిస్తున్న అతి తక్కువ వడ్డీ గృహ రుణాలు

Highlights

బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ కీలక భాగస్వామి అయిన Bajaj FinServ ఇంతకు ముందెన్నడూ లేని అతి తక్కువ వడ్డీ రేట్లు కలిగిన ...

బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ కీలక భాగస్వామి అయిన Bajaj FinServ ఇంతకు ముందెన్నడూ లేని అతి తక్కువ వడ్డీ రేట్లు కలిగిన గృహ రుణాలు మరియు గృహ రుణ బాకీ బదలాయింపు పధకాన్ని పరిమిత కాలానికి ప్రకటించింది. ఋణం తీసుకుని స్వంత ఇంటి కలను నెరవేర్చుకోవాలి అనుకునే వారికి సులభసరళంగా పొందే వీలుగా కేవలం 8.30% శాతం వడ్డీతో అందజేస్తోంది. దీనికి తీసుకోవాల్సిన ఋణం కనీస విలువ 30 లక్షలుగా నిర్ధారించబడింది. ప్రస్తుతమున్న మార్కెట్ ని పరిశీలనలోకి తీసుకుంటే కనక ఏ ఆర్ధిక సంస్థతో పోల్చుకున్నా ఇది అత్యల్ప వడ్డీ ఇస్తున్న వాటిలో ప్రముఖంగా చెప్పవచ్చు

Bajaj FinServ దీనితో పాటు అత్యధిక టాప్ అప్ 50 లక్షల రూపాయల దాకా ఋణం తీసుకున్న వినియోగదారులు బదలాయింపు కోరుకుంటే కనక అది కూడా అతి స్వల్ప వడ్డీతో చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది. ఈ టాప్ అప్ మొత్తాన్ని వివిధ రకాల ప్రయోజనాల కోసం వాడుకునే విధంగా ఇది రూపొందించడం జరిగింది. గృహాలంకరణ, ఇంటీరియర్, పెళ్లి, విహార యాత్ర , మరో ఇల్లు కొనే ఆలోచన అవసరం ఏదైనా సులభమైన పద్ధతుల్లో పొందే వీలుని కల్పిస్తోంది Bajaj FinServ. గృహ రుణ బాకీ బదలాయింపు కింద కల్పిస్తున్న ఈ సౌకర్యం అతి తక్కువ వడ్డీని అందించడమే కాక మీ పొదుపు, నెల వారి ఈఎంఐ చెల్లింపులకు అనుగుణంగా ఉంటుంది.

ఈ పధకం కొత్తగా ఋణం తీసుకోవాలనుకున్న ప్రతి ఒక్క కస్టమర్ తో పాటుగా నవంబర్ 23 నుంచి నవంబర్ 29 లోపు గృహ ఋణ బాకీ బదలాయింపు కోరుకునే ప్రస్తుత ఋణగ్రహీతలకు కూడా వర్తిస్తుంది.

Bajaj FinServ అందించే గృహ రుణాలు ఇతర ప్రయోజనాలు కూడా కలిగి ఉంటాయి. తక్షణ ఋణ ఆమోదం, 3 ఈఎంఐ సెలవులు, ఋణ మొత్తాన్ని వెంటనే అందజేసే లాంటివి ఎన్నో ఇందులో ఉన్నాయి.

Bajaj FinServ గృహ రుణ ప్రయోజనాలు

ఈ పధకం కింద ఋణం తీసుకునే వినియోగదారులకు ప్రత్యేకంగా మూడు ఈఎంఐ సెలవులు అందుతాయి. దీని వల్ల కస్టమర్ ఋణం తీసుకున్న మూడు నెలల తర్వాత తన చెల్లింపులు కొనసాగించవచ్చు. ఈ సమయంలో కస్టమర్స్ ఇక్కడ చెల్లించవలసిన మొత్తాన్ని తమ అవసరానికి వేరే వాటికి ఉపయోగించుకునే సౌలభ్యం కలుగుతుంది.

Bajaj FinServ లోన్ కోసం అప్లై చేసుకోవడం చాలా సులభమైన మరియు సరళతరమైన పద్దతి. తనకు ఋణం తీసుకునే అర్హత ఉందొ లేదో కస్టమర్ స్వయంగా ఆన్ లైన్ ద్వారా తెలుసుకునే సౌలభ్యం కల్పించడం జరుగుతుంది. హోం లోన్ ఈఎంఐ క్యాలికులేటర్ ద్వారా తనకు అనుకూలమైన వ్యవధిని ఎంచుకుని దానికి తగ్గట్టు చెల్లింపు ప్రణాళిక చేసుకునే వెసులుబాటు Bajaj FinServ కల్పిస్తుంది

ఋణం కోసం అప్లై చేసుకున్న వినియోగదారుడి అర్హతలు పరిశీలించి అవి తగిన విధంగా ఉన్నాయని ధృవీకరించుకున్న 5 నిమిషాల్లో కంపెనీ తరఫున ప్రతినిధి సదరు కస్టమర్ ని సంప్రదించడం జరుగుతుంది. కావలసిన కనీస ధృవీకరణ పత్రాలు గుర్తింపు కార్డు, అడ్రెస్ ప్రూఫ్, ఆదాయ వివరాలు కూడిన పత్రం, బ్యాంకు స్టేట్మెంట్ ఇలా కొన్నింటిని సమకూర్చుకుంటే, కంపనీ ప్రతినిధి స్వయంగా ఇంటి దగ్గరకు వచ్చి కస్టమర్ కు అనుకూలమైన సమయంలో చెప్పిన చోటుకే వచ్చి అవన్నీ సేకరించుకుంటారు.

బజాజ్ ఫైనాన్సు సంస్థ గురించి

బజాజ్ ఫైనాన్సు లిమిటెడ్ లో కీలక విభాగమైన Bajaj FinServ గ్రూప్ ఇప్పుడున్న వ్యవస్థీకృత ఎన్బిఎఫ్సి(NBFC)లలో మెరుగైన సేవలు అందిస్తూ భారతదేశం నలుమూలలో ఉన్న 21 మిలియన్ కస్టమర్ల ఆదరణ చూరగొంటోంది. పూనే నగరంలో హెడ్ క్వార్టర్స్ కలిగిన బజాజ్ సంస్థ వివిధ రకాల సేవలను అందుబాటులో ఉంచింది. అందులో గృహావసర రుణాలు, గృహ రుణాలు, క్రెడిట్ కార్డులు, ద్విచక్ర మరియు త్రిచక్ర వాహనాల రుణాలు, నిర్మాణ సామాగ్రి రుణాలు, ఏదైనా ఆస్తిని కుదువగా ఉంచుకుని వివిధ రకాల గ్రామీణ అవసరాల కోసం ఇచ్చే బంగారు రుణాలు, వాహన రీ ఫైనాన్సు రుణాలు ఇలా ఎన్నో సేవలను వివిధ రకాల కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందజేస్తోంది. బజాజ్ ఫైనాన్సు లిమిటెడ్ FAAA ద్వారా నిర్ధారించబడి అత్యధిక క్రెడిట్ రేటింగ్ కలిగిన సంస్థ NBFCలలో ప్రధమ గుర్తింపు దక్కించుకుంది.

Next Story