బిందెలో తలదూర్చిన చిన్నారి...బిందె నుంచి తలను తీసేందుకు విశ్వప్రయత్నం

బిందెలో తలదూర్చిన చిన్నారి...బిందె నుంచి తలను తీసేందుకు విశ్వప్రయత్నం
x
Highlights

పొరపాటునో గ్రహపాటునో బిందెలో తల ఇరుక్కుపోవడం అది రాకపోతే నానా తంటాలు పడే సీన్లు సినిమాల్లో చూశాం. అక్కడ కామెడీ పండించేందుకు ఇలాంటి సీన్లు...

పొరపాటునో గ్రహపాటునో బిందెలో తల ఇరుక్కుపోవడం అది రాకపోతే నానా తంటాలు పడే సీన్లు సినిమాల్లో చూశాం. అక్కడ కామెడీ పండించేందుకు ఇలాంటి సీన్లు వాడుకున్నారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు ఇలా బిందెలో తల ఇరుక్కుపోయిన సీన్లను సినిమాల్లో చూశాం. సినిమాలో కామెడి కోసం ఇలాంటి సీన్లు పండినా రియల్ లైఫ్ లో మాత్రం అలాంటి సీన్ ఎదురైతే అంతా టెన్షన్ పడిపోవాల్సిందే ఇప్పుడు రాజస్థాన్ లో ఎదురైన సీన్ కూడా ఇలాంటిదే. కానీ ఇక్కడ ఏడాది వయసు పాప అదీ గుక్కపట్టి ఏడుస్తుండటంతో అంతా టెన్షన్ పడ్డారు.

ఏడాది వయసున్న ఓ చిన్నారి ఆటాడుకుంటున్న చిన్నారి తల బిందెలో ఇరుక్కుపోయింది. ఇంట్లోని వాళ్లంతా ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్న సమయంలో చిన్నారి అక్కడే ఆడుకుంటూ వెళ్లి బిందెలో తల దూర్చింది. చుట్టూ చీకటి ఉండి ఏమి కనిపించకపోవడంతో ఏడవడం ప్రారంభించింది. చిన్నారి కేకలు విన్న తల్లిదండ్రులు బిందెలో ఇరుక్కున్న బిడ్డను చూసి కంగారు పడ్డారు. చుట్టుపక్కల వారితో కలిసి బిందె నుంచి చిన్నారిని తీసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు.

ఓవైపు బిందెలో తల ఇరుక్కుపోవడంతో చిన్నారి ఏడుపు మరోవైపు తల్లిదండ్రుల ఆందోళనతో ఏమి తోచని పరిస్థితిలో చుట్టుపక్కల ఉన్న వాళ్లు చిన్నారి తలను బిందె నుంచి బయటకు తీసే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ల వళ్ల కాలేదు. బల ప్రయోగం చేసి తీసే ప్రయత్నం చేసినా చిన్నారి తలపై ఒత్తిడి పెరుగుతుండటంతో ఆ ప్రయత్నం మానుకున్నారు.

రాజస్ధాన్‌లోని బరత్‌పుర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బిందెలో తల దూర్చిన చిన్నారిని బయటకు తీసే ప్రయత్నం విఫలం కావడంతో స్ధానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడున్న బంగారు బిస్కెట్లు కత్తిరించే భారీ కత్తెరలతో ఓ వైపు నుంచి బిందెను కత్తిరించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో చిన్నారి ఏడుపులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.

ఓ గంట పాటు కష్టపడి చిన్నారి తల ఇరుక్కున్న బిందెను అతి కష్టం మీద కట్ చేసి చిన్నారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా బయటకు తీశారు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక అప్పటి వరకు చీకటి గదిల బందీ అయినట్టుగా గడిపిన చిన్నారి అందులో నుంచి విముక్తి కావడంతో తండ్రి చెంతకు చేరింది.

మనుషులకే కాదు ఇలాంటి కష్టాలు జంతువులకు ఎదురైన ఘటనలు ఉన్నాయి. గతంలో ఓ చిరుత ఎండా కాలంలో నీటని అన్వేషిస్తూ గ్రామ శివారుకు వచ్చి బిందెలో తలపెట్టిన ఓ చిరుత నానా కష్టాలపడింది. దారి తెలియక ఎక్కడుందో అర్ధం కాక ఆ చిరుత అష్టకష్టాలు పడింది. దాన్ని చూసి ముందు నవ్వుకున్న జనం ఆ తర్వాత దాన్ని రక్షించడం ఎలా తెలియక తికమక పడ్డారు. దగ్గరి కెళ్లాలంటే ఎక్కడ పంజా విసురుతుందోననే భయం ఓ వైపు అలాగే వదిలేస్తే చచ్చిపోతుందనే జాలి మరోవైపు ఇలా కొన్ని గంటలపాటు చిరుతపులి బిందెలో బందీగా ఊరంతా తిరిగింది.

బిందెలో తలదూర్చిన చిరుతపులికి ముందుగా ఫారెస్ట్ అధికారులు మత్తు మందు ఇచ్చి ఆతర్వాత నెమ్మదిగా బిందెను పూర్తిగా దాని తల నుంచి తీసే ప్రయత్నం చేశారు. ఓ గంటపాటు కష్టపడిన తర్వాత బిందెను తీశారు. మొత్తానికి ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటం కాస్త వింతగా అనిపిస్తున్నాయి. అయితే మీ పిల్లలను పరిసరాల్లో ఆడుకునేటప్పుడు ఓ కంట కనిపెడుతూ ఉండాలనే విషయం ఇలాంటి ఘటనలు గుర్తు చేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories