logo
జాతీయం

జైట్లీకి కేజ్రీవాల్‌ క్షమాపణలు

జైట్లీకి కేజ్రీవాల్‌ క్షమాపణలు
X
Highlights

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ క్షమాపణల పర్వం కొనసాగుతోంది. ఢిల్లీ, డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్...

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ క్షమాపణల పర్వం కొనసాగుతోంది. ఢిల్లీ, డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేసిన కాలంలో జైట్లీ ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు ఆప్ నేతలు ఆరోపించారు. దీనిపై అరుణ్‌జైట్లీ కోర్టు పరువునష్టం దావా వేయడంతో...కేజ్రీవాల్‌ ఎక్కువ కాలం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీంతో ఢిల్లీ సీఎం...అరుణ్‌జైట్లీకి సారి చెబుతూ లేఖ రాశారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణల పర్వం కంటిన్యూ అవుతోంది. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి కేజ్రీవాల్‌ క్షమాపణ చెప్పారు. ఢిల్లీ, డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జైట్లీ అక్రమాలకు పాల్పడినట్లు ఆప్ నేతలు కేజ్రీవాల్, రాఘవ్ ఛద్దా, కుమార్ విశ్వాస్, సంజయ్ సింగ్, అశుతోష్, దీపక్ బాజ్‌పాయి గతంలో ఆరోపించారు. దీనిపై అరుణ్ జైట్లీ రూ. 10 కోట్లకు పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీంతో ఆప్ నేతలు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌తోపాటు ఆప్ నేతలు సంజయ్ సింగ్, రాఘవ్ ఛద్దా, అశుతోష్ కూడా జైట్లీకి క్షమాపణ చెబుతూ లేఖ రాశారు.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ క్షమాపణలను అరుణ్ జైట్లీ అంగీకరించారు. తాను దాఖలు చేసిన పరువు నష్టం దావాను ఉపసంహరించుకుంటానని జైట్లీ స్పష్టం చేశారు. ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావాను ఉపసంహరించుకునేందుకు దరఖాస్తు చేయబోతున్నట్లు సమాచారం. కేజ్రీవాల్ ఇప్పటి వరకు పంజాబ్ కాంగ్రెస్ నేత మజితియా, బీజేపీ నేత నితిన్ గడ్కరీ, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్‌కు సారీ చెప్పారు.

Next Story