ఏపీ రాజధాని నిర్మాణంపై జైట్లీ కీల‌క ప్ర‌క‌ట‌న

ఏపీ రాజధాని నిర్మాణంపై జైట్లీ కీల‌క ప్ర‌క‌ట‌న
x
Highlights

శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జ‌రుగుతున్నాయి. ఈ స‌మావేశాల్లో ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి నిధుల కేటాయింపుపై వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు...


శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జ‌రుగుతున్నాయి. ఈ స‌మావేశాల్లో ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి నిధుల కేటాయింపుపై వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్నోత్త‌రాల్ని లేవ‌నెత్తారు. ఈ ప్ర‌శ్నోత్త‌రాల‌పై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. అమ‌రావ‌తి నిర్మాణం కోసం ఏపీ ప్ర‌భుత్వం రూ.3,324కోట్లు కావాల‌ని ప్ర‌పంచ బ్యాంకును కోరిన‌ట్లు తెలిపారు. ఈ రుణంపై వ‌ర‌ల్డ్ బ్యాంక్ ప‌రిశీలిస్తుంద‌ని చెప్పారు. ఈ ప‌రిశీల‌న పూర్త‌యిన వెంట‌నే రాష్ట్రానికి అడిగిన నిందులు మంజూరు అవుతాయ‌ని సూచించారు. ఇదిలా ఉంటే కేంద్రం ఏపీ రాజధాని అమరావతిలో అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మాణానికి కేంద్రం ఇప్పటికే రూ. 1500 కోట్లు ఇచ్చిందని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories