భారత బాక్సర్ దీనగాథ.. ఐస్‌క్రీములు అమ్ముకుంటూ…

భారత బాక్సర్ దీనగాథ.. ఐస్‌క్రీములు అమ్ముకుంటూ…
x
Highlights

బాక్సింగ్‌లో దేశ కీర్తిపతాకను అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించిన బాక్సర్ దినేశ్ కుమార్ ఇప్పుడు దయనీయ పరిస్థితిలో ఉన్నాడు. బతుకు తెరువు కోసం కుల్ఫీ...

బాక్సింగ్‌లో దేశ కీర్తిపతాకను అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించిన బాక్సర్ దినేశ్ కుమార్ ఇప్పుడు దయనీయ పరిస్థితిలో ఉన్నాడు. బతుకు తెరువు కోసం కుల్ఫీ ఐస్‌క్రీములు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు అందుకున్న బాక్సర్‌కు ప్రభుత్వం అర్జున అవార్డు ఇచ్చి సత్కరించింది కూడా. అర్జున అవార్డు గ్ర‌హీత అయిన అత‌ను త‌న తండ్రి చేసిన అప్పు తీర్చేందుకు ఐస్ క్రీమ్‌లు అమ్ముతున్నాడు. బాక్స‌ర్ దినేశ్ ఇప్ప‌టి వ‌ర‌కు 17 స్వ‌ర్ణాలు, ఒక సిల్వ‌ర్‌, అయిదు కాంస్య ప‌త‌కాలు గెలుచుకున్నాడు. అంత‌ర్జాతీయ టోర్నీల‌కు వెళ్లేందుకు.. త‌న తండ్రి బ్యాంకులో అప్పు తీసుకున్నాడ‌ని, అయితే ఆ అప్పును తీర్చేందుకు తాను ఐస్ క్రీమ్‌లు అమ్మాల్సి వ‌స్తుంద‌ని దినేశ్ తెలిపాడు. ఏ ప్ర‌భుత్వం కూడా త‌న అప్పు తీర్చ‌డం లేద‌న్నాడు. త‌న‌కు ఓ ఉద్యోగం ఇవ్వాల‌ని అత‌ను ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశాడు. అంతేకాదు 2014 కామన్వెల్త్ క్రీడలకు ముందు దినేష్‌కు యాక్సిడెంట్ అవ్వడంతో బాక్సింగ్‌కు దూరం అయ్యాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories