సైరా నుంచి తప్పుకోలేదు..చిరంజీవే తప్పించాడా

Highlights

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న‌ 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాని.....

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న‌ 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాని.. తెలుగు జాతి గర్వించదగ్గ వీరుడు, స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథని ఆధారంగా చేసుకుని.. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జ‌రుపుకుంటోంది. కాగా, డిసెంబర్ నెల నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

అందులో భాగంగా చిత్ర యూనిట్ సినిమాలోని యాక్టర్స్ ను, లోకేషన్లను చూసుకుంటుంది. ఈ నేపథ్యంలో 'సైరా' నుంచి తాను తప్పుకుంటున్నట్టు ఆస్కార్ అవార్డు విజేత, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అధికారికంగా ప్రకటించారు.తనకు చిరంజీవి అంటే చాలా ఇష్టమని చెప్పిన రెహమాన్, ఎంతో బిజీ షెడ్యూల్ కారణంగానే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా తెలిపారు. రెహమాన్ తప్పుకోవడంపై ఓ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

తన అభిమాన నటుడు చిరంజీవి ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు రెహమాన్ విచారం వ్యక్తంచేశారు. అయితే రెహమాన్ తప్పుకోలేదని..కావలనే చిరంజీవి తప్పించాడని ఫిల్మింనగర్ లో చక్కెర్లు కొడుతుంది. సైరా నరసింహారెడ్డి మూడు భాషల్లో విడుదలవుతున్న విషయం తెలిసిందే. దీన్ని మార్కెట్ చేసుకునేందుకు చిత్రయూనిట్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి మ్యూజిక్ డైరక్టర్ గా ఏఆర్ రెహమాన్ ను సంప్రదించారు. దీంతో రెహాన్ తనకున్న క్రేజ్ ప్రకారం పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేశారట. అందుకు చిరంజీవి ఒప్పుకోలేదని ..చివరికి పేచీ వచ్చి రెహమాన్ తప్పుకున్నాడని తెలుస్తోంది. అతని స్థానంలో మరో పెద్ద సంగీత దర్శకుడిని పెట్టాలని చిరంజీవి భావిస్తోంటే సురేందర్‌ మాత్రం తమన్‌ అయితే మంచి ఆప్షన్‌ అని అంటున్నాడట. మరి చివరకు సైరా కోసం సై అనే ఆ సంగీతకారుడు ఎవరో?

Show Full Article
Print Article
Next Story
More Stories