అందుకే నా మనుమడు దేవాన్షును తీసుకువచ్చా: చంద్రబాబు

అందుకే నా మనుమడు దేవాన్షును తీసుకువచ్చా: చంద్రబాబు
x
Highlights

పోలవరంలో ఏపీ ప్రభుత్వం నిర్వహించన గ్యాలరీ వాక్ లో.. సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. తాత అడుగుల్లో అడుగులు వేస్తూ.....

పోలవరంలో ఏపీ ప్రభుత్వం నిర్వహించన గ్యాలరీ వాక్ లో.. సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. తాత అడుగుల్లో అడుగులు వేస్తూ.. గ్యాలరీ వాక్ లో హుషారుగా పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో సందడి చేస్తూ అందరిని ఆకట్టుకున్నాడు.రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఒకసారి చూడాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు చూస్తే.. ఒక అవగాహన వస్తుందని అన్నారు. అందుకే తన మనుమడు దేవాన్షును కూడా తీసుకువచ్చానని సీఎం చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల్లో పిల్లలు కూడా భాగస్వాములైతే, భవిష్యత్తులో వారికొక స్ఫూర్తి, ఆలోచన ఉంటుందని, అందుకే దేవాన్షును తీసుకువచ్చానని సీఎం అన్నారు. పొలవరం ఒక చరిత్ర అని, ఈ చరిత్రలో రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి భాగస్వాములు కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories