Top
logo

జహీర్ వివాహ విందులో విరాట్-అనుష్క డ్యాన్స్

Highlights

టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ వివాహవిందులో విరాట్ కొహ్లీ-అనుష్కశర్మ జోడీ భాంగ్రా డ్యాన్స్ తో...

టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ వివాహవిందులో విరాట్ కొహ్లీ-అనుష్కశర్మ జోడీ భాంగ్రా డ్యాన్స్ తో అదరగొట్టారు. భాంగ్రా బీట్ కు అనుగుణంగా స్టెప్పులేస్తూ సందడి సందడి చేశారు. ఈ కార్యక్రమానికి సచిన్‌ తెందుల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, సానియా మీర్జా, ఆశిష్‌ నెహ్రా, యువరాజ్‌ సింగ్‌తో పాటు అజిత్‌ అగార్కర్‌, హర్భజన్‌ సింగ్‌, పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కోహ్లీ జోడీ నూతన వధూవరులతో డ్యాన్స్‌ చేస్తూ సందడిగా గడిపిన వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ తర్వాత జహీర్ ఖాన్- సాగరిక జంట స్పెషల్ కేక్ ను కట్ చేసి రిసెప్షన్ కు అందమైన ముగింపు ఇచ్చారు. శ్రీలంకతో రెండోటెస్ట్ మ్యాచ్ ఒకరోజు ముందుగానే ముగియడంతో టీమిండియా క్రికెటర్లందరూ ఈ కార్యక్రమానికి హాజరుకాగలిగారు.

Virat Kohli & Anushka Sharma At Zaheer Khan's Wedding Reception Last Night in Mumbai!#Virushka ❤️ pic.twitter.com/lltmreBYJf

— Virat Kohli FC™ (@ViratsPlanet) November 28, 2017

Next Story