Top
logo

వారం తరువాత భూమి లోపలి గది నుంచి బయటకు వచ్చిన అంజమ్మ మాత..!

X
Highlights

మెదక్ జిల్లా ఇస్లాంపూర్‌ శ్రీ రామలింగేశ్వర ఆలయం దగ్గర భారీగా భక్తుల పూజలు చేస్తున్నారు. గత వారం రోజులు నుంచి...

మెదక్ జిల్లా ఇస్లాంపూర్‌ శ్రీ రామలింగేశ్వర ఆలయం దగ్గర భారీగా భక్తుల పూజలు చేస్తున్నారు. గత వారం రోజులు నుంచి భూమి లోపలి గదిలో ధ్యానం చేస్తున్న అంజమ్మ మాత ఈ రోజు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కర్నాటకలోని బీదర్‌ నుంచి వచ్చిన అంజమ్మ మాత తాను శ్రీ మనికేశ్వరి మాత శిష్యురాలుగా చెబుతోంది. లోక కళ్యాణం కోసమే తాను ధ్యాన తపస్సు చేస్తున్నట్టు అంజమ్మ మాత చెబుతోంది. భూమి లోపలి గది నుంచి అంజమ్మ మాత బయటకు వస్తుందన్న విషయం తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. అమ్మవారికి పాదాభిందనాలు చేస్తూ తరించారు. పండ్లు, పలహారాలు స్వీకరించాలంటూ కోరిన భక్తుల విన్నపాన్ని తిరస్కరించిన అంజమ్మ మాత తనకు గాలే ఆహారమన్నారు. భగవంతుడు దీవించనంత కాలం అన్నపానీయాలు లేకుండా జీవిస్తానంటూ ఆమె చెబుతున్నారు.

Next Story