చికాగో సెక్స్ రాకెట్: స్పందించిన అనసూయ, శ్రీరెడ్డి

చికాగో టాలీవుడ్ సెక్స్ ట్రాఫికింగ్ కేసులో దక్షిణాదికి చెందిన ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు సహా పలువురికి ప్రమేయం...
చికాగో టాలీవుడ్ సెక్స్ ట్రాఫికింగ్ కేసులో దక్షిణాదికి చెందిన ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు సహా పలువురికి ప్రమేయం ఉందని తెలుస్తోంది. కిషన్ మోదుగుపుడి అలియాస్ శ్రీరాజ్ చెన్నుపాటి ఆయన భార్య చంద్రకళను అరెస్ట్ చేసిన పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ప్రొడక్షన్ మేనేజర్‌గా, సహనిర్మాతగా గతంలో పనిచేసిన కిషన్ తనకున్న పరిచయాలతో ఈవెంట్ల పేరిట సినీ తారలను అమెరికా రప్పించేవాడు. ఏడాది కాలంలో వీరు వర్దమాన తారల కోసం 76 విమాన టికెట్లు బుక్ చేశారంటే.. సెక్స్ దందా ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. వీరి బారిన పడిన తారల్లో ఐదుగురి పేర్లను ఫిర్యాదులో నమోదు చేశారని.. బెంగళూరు, చెన్నై నగరాలకు చెందిన ఇద్దరు ప్రముఖ నటీమణుల పేర్లు కూడా ఇందులో ఉన్నాయని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ అమెరికా దంపతులు గతంలో తమను కూడా సంప్రదించారని నటి శ్రీరెడ్డి, యాంకర్ కమ్ నటి అనసూయలు ఓ ఆంగ్ల పత్రికకు తెలిపారు.
మాట్లాడే తీరు నచ్చక తిరస్కరించాను: అనసూయ
ఈ ఉదంతంపై యాంకర్ అనసూయ భరద్వాజ్ స్పందిస్తూ.. ‘ చాలా రోజులుగా నేను అమెరికా వెళ్లలేదు. 2014లో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్‌లో ఓ ఈవెంట్‌కు హాజరయ్యాను. 2016లో అమెరికా నెంబర్‌తో శ్రీరాజ్ అనే వ్యక్తి నన్ను సంప్రదించాడు. తెలుగు అసోసియేషన్ నిర్వహించే ఓ కార్యక్రమానికి హాజరుకావాలని కోరాడు. అతను మాట్లాడే విధానం నచ్చక నేను తిరస్కరించాను. నేను తిరస్కరించినా కూడా పోస్టర్లో నాఫొటోను ప్రచురించారు. ఆ ఈవెంట్లో పాల్గొనడం లేదని అప్పట్లో నేను ట్విటర్ ద్వారా స్పష్టం చేశాను’ అని అనసూయ తెలిపారు.
పాపులారిటీని బట్టి ధర: శ్రీరెడ్డి
క్యాస్టింగ్ కౌచ్‌పై ఉద్యమిస్తూ వార్తాల్లో నిలిచిన నటి శ్రీరైడ్డి సైతం.. ఆ అమెరికా దంపతులు తనను కూడా సంప్రందించారని తెలిపారు. ‘అవకాశాల్లేని హీరోయిన్లను ఈవెంట్స్ కోసం అమెరికాకు రప్పించి.. అక్కడ వారిని మభ్యపెట్టి వ్యభిచారాంలోకి దింపుతున్నారు. అలా వెళ్లిన ఆర్టిస్టులకు సుమారు 1000 అమెరికా డాలర్లు ఆఫర్ చేస్తున్నారు. ఈ ఆఫర్ వారి పాపులారిటీని బట్టి ఉంటుంది.’ అని ఆమె చెప్పుకొచ్చారు.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT