ముందస్తు ఎన్నికలు కేవలం కెసిఆర్ కుటుంబంకోసమే: అమిత్ షా

ముందస్తు ఎన్నికలు కేవలం కెసిఆర్ కుటుంబంకోసమే: అమిత్ షా
x
Highlights

ముందస్తు ఎన్నికల వల్ల తెలంగాణ ప్రజలపై అదనపు భారం పడుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు వరంగల్ జిల్లా...

ముందస్తు ఎన్నికల వల్ల తెలంగాణ ప్రజలపై అదనపు భారం పడుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు వరంగల్ జిల్లా పరకాలలో నిర్వహించిన బహిరంగసభలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తన కుటుంబ సభ్యులను గెలిపించుకోవడానికే ముందస్తు ఎన్నికలకు వెళ్లారని విమర్శించారు. నరేంద్రమోడీ ప్రధాని అయ్యాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, బీసీ కమిషన్‌కు మోడీ చట్టబద్ధత కల్పించారని ఆయన కొనియాడారు. తెలంగాణ అభివృద్ధి భారీగా నిధులు మంజూరు చేసారని వెల్లడించారు. పేదల ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భారత్ తెస్తే కేసీఆర్ తెలంగాణలో అమలు చేయలేదన్నారు. మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ మార్చేశారని ఆయన మండిపడ్డారు.

ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్‌ను నిర్ణయించబోతుందని అమిత్ వ్యాఖ్యనించారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని, ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కేసీఆర్‌ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అమిత్‌షా మండిపడ్డారు. తెలంగాణ రాకముందు విమోచన దినాన్ని జరుపుతామన్న కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఒవైసీకి తలొగ్గి విమోచన దినం జరపడం లేదన్నారు. మహాకూటమి వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, బీజేపీకి ఓట్లేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories