నోరు జారి అడ్డంగా బుక్కైన అమిత్‌షా

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన తరుణంలో బిజెపి సెల్ఫ్ గోల్ చేసుకుంది. ఆ పార్టీ జాతీయ...
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన తరుణంలో బిజెపి సెల్ఫ్ గోల్ చేసుకుంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన ఒక చిన్న పొరపాటు ఇప్పడు కాంగ్రెస్ కు తిరుగులేని ఆయుధంగా మారింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బిజెపిపై చేసిన ఆరోపణలను తిప్పి కొట్టే క్రమంలో అమిత్ షా ఈరోజు కర్ణాటకలోని దావణగెరేలో మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యాడ్యూరప్పను అవినీతిపరుడిగా పేర్కొన్నారు. ఈ మధ్యే సుప్రీంకోర్టుకు చెందిన ఓ రిటైర్డు జడ్జి దేశంలో పేరుకుపోయిన అవినీతి గురించి మాట్లాడుతూ.. ఇప్పటిదాకా తాను గమనించిన ప్రభుత్వాల్లో అత్యంత అవినీతికరమైన ప్రభుత్వం యాడ్యూరప్పదే అని చెప్పారని షా తెలిపారు. అదే సమయంలో అమిత్ షా పక్కనే యాడ్యూరప్ప కూడా కూర్చున్నారు. షా మాటలతో యాడ్యూరప్ప కంగుతిన్నారు. వెంటనే పక్కనే ఉన్న మరో నేత షా చెవిలో ఏదో చెప్పారు. దీంతో చేసిన పొరపాటును గ్రహించిన అమిత్ షా... యాడ్యూరప్ప కాదు, సిద్ధరామయ్య అని సవరించుకున్నారు.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
ముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMTKidney Stone: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా.. అసలు విషయం...
12 Aug 2022 1:30 PM GMT