logo
సినిమా

అమిర్ ఖాన్ కు ఆహ్వానం అందలేదంట..!

అమిర్ ఖాన్ కు ఆహ్వానం అందలేదంట..!
X
Highlights

ఇటీవల జరిగిన పాకిస్తాన్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి, అతిపెద్ద పార్టీగా అవతరించింది పాక్ మాజీ క్రికెటర్ ...

ఇటీవల జరిగిన పాకిస్తాన్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి, అతిపెద్ద పార్టీగా అవతరించింది పాక్ మాజీ క్రికెటర్ ఇ్రమాన్ ఖాన్ నేతృత్వంలోని తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ (పీటీఐ). ఈ నెల 11న పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన సార్క్ దేశాధినేతలతో పాటు భారత ప్రధాని మోదీని, భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, నవజ్యోత్ సింగ్ సిద్దూ, సునీల్ గవాస్కర్లను అలాగే వివిధ ప్రముఖలను తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. అయితే వీరితో పాటు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమిర్ ఖాన్ కు కూడా ఆహ్వానం అందినట్లు ఈ మధ్య వార్తలు వచ్చాయి.

అయితే వార్తలపై మీడియా అమిర్ ఖాన్ ప్రశ్నిచగా.. తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదంటూ స్పష్టం చేశారు అమీర్. ప్రస్తుతం పానీ ఫౌండేషన్‌ కార్యక్రమాల్లో తీరక లేకుండా ఉన్నట్లు తెలిపారు. ఆగస్టు 12న జరిగే ప్రజా కార్యక్రమానికి హాజరవుతున్నట్లు చెప్పారు. పానీ ఫౌండేషన్‌ నిర్వహించే ఈ కార్యక్రమంలో సుమారు 10 వేల మంది గ్రామస్తులు పాల్గొంటారని ఆయన ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Next Story