విజయ్ దేవేరకొండ దర్శకుడితో బన్నీ

విజయ్ దేవేరకొండ దర్శకుడితో బన్నీ
x
Highlights

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆఖరిగా 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా తో మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ సినిమా...

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆఖరిగా 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా తో మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ సినిమా విడుదలై చాలా నెలలు గడిచి పోయింది కానీ బన్నీ మాత్రం ఇంకా తన నెక్స్ట్ సినిమా గురించి అప్డేట్ ఇవ్వలేదు. గత కొంతకాలంగా బన్ని త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని వార్తలు వింటూనే ఉన్నాం. 'అరవింద సమేత' హిట్ అయిన తరువాత త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి బన్నీ మొగ్గు చూపాడని సమాచారం. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.

ఈ నేపథ్యంలో తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడట. కారణమేంటో తెలియదు కానీ బన్నీ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ తో చేయడంలేదు. అయితే గీత ఆర్ట్స్ బ్యానర్ లో విజయ్ దేవరకొండ రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన 'గీతగోవిందం' సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా చూసి పరశురాం దర్శకత్వానికి ఫిదా అయిపోయిన బన్నీ తన తో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట. ఇప్పుడు బన్నీ నెక్స్ట్ సినిమా పరశురామ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మించనుంది. ఈ సినిమా తాలూకు అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories