మోడీని కలవాలంటే ఇకపై మరింత కష్టం

మోడీని కలవాలంటే ఇకపై మరింత కష్టం
x
Highlights

ప్రధాని నరేంద్రమోడీకి విద్రోహ శక్తుల నుంచి ప్రాణాపాయం పొంచివుందని మరోసాని నిఘా వర్గాలు హెచ్చరించాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా మోడీకి ప్రమాదం పొంచి...

ప్రధాని నరేంద్రమోడీకి విద్రోహ శక్తుల నుంచి ప్రాణాపాయం పొంచివుందని మరోసాని నిఘా వర్గాలు హెచ్చరించాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా మోడీకి ప్రమాదం పొంచి ఉందని, ప్రధాని ప్రాణాలు తీసేందుకు విద్రోహ శక్తులు కంకణం కట్టుకుని వ్యూహరచన చేస్తున్నాయని ఇంటలిజెన్స్ బ్యూరో అప్రమత్తం చేసింది. ప్రధాని భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించిన నిఘా వర్గాలు జాగ్రత్తగా ఉండాలంటూ మోడీని అలర్ట్‌ చేశాయి.

గతంలో ఎన్నడూ లేనివిధంగా మోడీ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో కేంద్ర హోంశాఖ ప్రధాని భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఆ మేరకు మోడీ పర్యటనల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ నుంచి కొత్త నిబంధనలు వెళ్లాయి. వీటి ప్రకారం చివరి మంత్రులైనా సరే ఎస్పీజీ క్లియరెన్స్‌ ఉంటేనే మోడీ దగ్గరకు వెళ్లేందుకు, ఆయన్ని కలిసేందుకు అవకాశముంటుంది.

అగంతకుల నుంచి ప్రధానికి ప్రమాదం పొంచి ఉన్నందున మోడీకి దగ్గరకు నేరుగా ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. చివరికి బీజేపీ నేతలైనా సరే ప్రత్యేక భద్రతా విభాగం అనుమతి లేకుండా మోడీకి కలవడానికి అనుమతి ఇవ్వొద్దని ఆదేశించింది. ఆ మేరకు అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులకు కేంద్ర హోంశాఖ లేఖలు రాసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories