బ్యాంకులకు 5 రోజులు సెలవులు

దేశవ్యాప్తంగా రేపటి నుంచి ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. వరుస సెలవులు, బ్యాంకు...
దేశవ్యాప్తంగా రేపటి నుంచి ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. వరుస సెలవులు, బ్యాంకు ఉద్యోగులు, అధికారుల సమ్మెతో బ్యాంకులు పని చేయవు. బ్యాంకుల్లో పనులు ఉంటే మాత్రం వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు. వరుస సెలవులతో ఏటీఎంలలోనూ నగదు కొరత ఏర్పడే అవకాశాలున్నాయి. ఆర్థిక, వాణిజ్య కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడనున్నది. దేశవ్యాప్తంగా రేపటి నుంచి ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. డిసెంబర్ 21న బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. నాలుగు యూనియన్ల ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. లక్షలాది మంది సిబ్బంది విధులకు దూరంగా ఉండనున్నారు. 11వ వేతన సవరణ చేయాలని, బ్యాంకుల విలీనం ప్రక్రియ ఉపసంహరించుకోవాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
ఇక డిసెంబర్ 22 నాలుగో శనివారం, డిసెంబర్ 23 ఆదివారం బ్యాంకులకు సెలవు రోజులు. డిసెంబర్ 24న బ్యాంకులు పని చేస్తున్నప్పటికీ ఎక్కువ మంది ఉద్యోగులు సెలవులో ఉంటున్నారు. డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా బ్యాంకులకు సెలవు. డిసెంబర్ 26న యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు తప్ప మిగతా సేవలన్నీ నిలిచిపోనున్నాయి. బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో పాటు వరుస సెలవులు ఖాతాదారులపై ప్రభావం చూపే అవకాశముంది. లావాదేవీలు ప్లాన్ చేసుకోవాలని సమ్మెకు సహకరించాలని బ్యాంకు ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. మరో వైపు సెలవులతో ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. రేపు సమ్మె జరిగినా ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తాయి. శుక్రవారం ఒక్క రోజు నగదు సమస్య ఉండకపోవచ్చు. డిసెంబరు 26 వరకు మాత్రం నగదు కొరత ఏర్పడే అవకాశముంది.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT