అంబానీ ఇంట పెళ్లి సందడి

భారత కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన కుమార్తె ఇశా అంబానీ ప్రముఖ...
భారత కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన కుమార్తె ఇశా అంబానీ ప్రముఖ వ్యాపారవేత్త, పిరమాల్ సంస్థల వారసుడు ఆనంద్ పిరమాల్‌ను వివాహం చేసుకోనుంది. ఈ రెండు కుటుంబాల మధ్య 40 ఏళ్లుగా కొనసాగుతున్న స్నేహబంధం.. ఈ పెళ్లితో బంధుత్వంగా మారనుంది.
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట మరో శుభకార్యం జరగనుంది.. ఆయన పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ తన చిన్ననాటి స్నేహితురాలు శ్లోకా మెహతాను డిసెంబర్ లో వివాహం చేసుకోనున్నాడు.. అయితే ఈ పెండ్లి కంటే కాస్త ముందుగానే ముకేశ్ కుమార్తె ఇషా అంబానీ ప్రముఖ వ్యాపారవేత్త అజయ్ పిరమల్ కుమారుడైన ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకోనున్నారు.
ఈశా, ఆనంద్‌ల మంచి స్నేహితులు.. కొద్దిరోజుల క్రితం మహాబలేశ్వరంలోని ఓ గుడిలో ఆనంద్, ఇషాకు ప్రపోజ్ చేశారు. ఇషా కూడా అంగీకారం తెలిపింది.. అనంతరం ఈ విషయాన్ని ఇరువురి కుటుంబాలకు తెలిపారు.. ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతాల వివాహం కంటే ముందే ఆనంద్, ఇషాల వివాహం జరుగుతుందని తెలుస్తోంది...
హార్వర్డ్ బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్ అయిన ఆనంద్ ప్రస్తుతం పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ఇషా అంబానీ రిలయన్స్ జియోతో పాటు రిలయన్స్ రిటైల్ బోర్డుల్లో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి ఈ ఏడాది అబానీ ఇంట్లో రెండు శుభకార్యాలు జరగనున్నాయి..
జనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMTSinkhole: భారీగా పెరుగుతున్న వింత గొయ్యి లోతు..
9 Aug 2022 3:00 PM GMT
కామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTఇవాళ తెలంగాణ మంత్రివర్గం సమావేశం
11 Aug 2022 2:16 AM GMTఇవాళ గాంధీభవన్‌లో రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం
11 Aug 2022 1:46 AM GMTకేసీఆర్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం
11 Aug 2022 1:06 AM GMTనుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట
10 Aug 2022 4:00 PM GMT