ఎమ్మెల్యేలపై అనర్హత కేసు.. దిమ్మతిరిగే ట్విస్ట్‌

ఎమ్మెల్యేలపై అనర్హత కేసు.. దిమ్మతిరిగే ట్విస్ట్‌
x
Highlights

తమిళనాడులో దినకనర్‌ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసులో ఎవరూ ఊహించని ట్విస్ట్‌ చోటుచేసుకుంది. మద్రాసు హైకోర్టులో తమిళనాడు...

తమిళనాడులో దినకనర్‌ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసులో ఎవరూ ఊహించని ట్విస్ట్‌ చోటుచేసుకుంది. మద్రాసు హైకోర్టులో తమిళనాడు సర్కారుకు తాత్కాలిక ఉపశమనం దొరికింది. ఎమ్మెల్యేల అనర్హత వేటుపై హైకోర్టులో ఇద్దరు జడ్జిలు చెరో రకమైన తీర్పును ఇచ్చారు. దీంతో ఈ కేసు విస్తృత ధర్మాసనానికి మారింది. అయితే దినకరన్‌కు మద్దతుగా ఉన్న 18మంది ఏఐడీఎంకే ఎమ్మెల్యేలపై 2017 సెప్టెంబర్‌లో స్పీకర్ ధనపాల్ అనర్హత వేటు వేశారు. దీనిపై దినకరన్ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కేసును విచారించిన చీఫ్ జస్టిస్, జస్టిస్ వేర్వేరుగా తమ తీర్పును ఇవ్వడంతో కేసు విస్తృత ధర్మాసనానికి చేరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories