మెగా కంపౌండ్ నుంచి గ్రహాంతరవాసి

వరుణ్ తేజ్ తొలిప్రేమ సూపర్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. మిగతా అప్ కమింగ్ హీరోల్లా కాకుండా వెరైటీ కథలతో సూపర్...
వరుణ్ తేజ్ తొలిప్రేమ సూపర్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. మిగతా అప్ కమింగ్ హీరోల్లా కాకుండా వెరైటీ కథలతో సూపర్ యాక్టింగ్ తో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో మెగా ప్రిన్స్ అనిపించుకుంటున్నాడు. వాట్ నెక్ట్స్ అంటే త్వరలో తాను గ్రహాంతరవాసిని కాబోతున్నానంటున్నాడు. దీంతో ఫజిల్ కి గురికావడం అభిమానుల వంతైంది.
మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్..మొదటి సినిమాతోనే తాను మిగతా వారికంటే డిఫరెంట్ అనిపించుకున్నాడు. మాస్ క్లాస్ అని కాకుండా తన బాడీ లాంగ్వేజ్ కు సరిపడేలా ముకుందా సినిమాతో ఆడియెన్స్ ని అట్రాక్ట్ చేసాడు. సినిమా సినిమాకు వెరైటీ కథలతో వేరియేషన్ చూపిస్తూ..రీసెంట్ గా తొలిప్రేమతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు.
బ్యాక్ టుబ్యాక్ సినిమాలతో సక్సెస్లు సాధిస్తున్న వరుణ్ తేజ్ ఈసారి డిఫరెంట్ స్టోరీతో కూడిన సినిమా చేయబోతున్నాడు. స్పేస్ లో జరిగే కథాంశంతో వస్తున్న ఈ మూవీని ఘాజీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేయబోతున్నాడు. సైంటిఫిక్ ఫిక్షన్ జానర్ రాబోతున్న ఈ సినిమా పేరు కూడా అహం బ్రహ్మోస్మి అని ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ అస్ట్రోనాట్ గా నటిస్తున్నాడు. ఫర్ ఫెక్షన్ కోసం సినిమా టీం త్వరలో కజకిస్థాన్లోని స్పేస్ రిసెర్స్ సెంటర్ కు కూడ వెళ్లనున్నారు. మే నుంచి రెగ్యులర్ జరుపుకోనున్న ఈ మూవీని రాజీవ్ రెడ్డి, దర్శకుడు క్రిష్ నిర్మిస్తున్నారు.
తెలుగులోనే కాదు.. తమిళ్ లో కూడా స్పేస్ కథాంశంతో టిక్ టిక్ టిక్ అనే మూవీ నిర్మాణం జరుపుకుంది. అయితే ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా ఏప్రిల్ కి పోస్ట్ పోన్ అయింది. జయం రవి, నివేథా పెతురాజ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ మూవీకి శక్తి సౌందరరాజన్ దర్శకత్వం వహించాడు.
స్పేస్ రిలేటెడ్ కథాంశంతో సినిమాలను తెరకెక్కించడంలో బాలీవుడ్ మనకంటే ఒకడుగు ముందే ఉంది. మొదటి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ జీవిత కథ ఆదారంగా సిద్దార్థ రాయ్ కపూర్ బయోపిక్ మూవీ నిర్మించనున్నారు. మహేష్ మత్తయ్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్నాడు. అశుతోష్ గోవార్కర్ డైరెక్ట్ చేసిన స్వదేశ్ మూవీలో షారుక్ ఇదివరకే నాసా ఇంజనీర్ గా నటించాడు... కాని ఈ మూవీలో భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మగా షారుక్ నటించనున్నాడు.
యుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMT
శ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTమోడి పర్యటనతో రాజకీయాలు హీట్.. మంత్రుల కౌంటర్ ఎటాక్...
27 May 2022 6:23 AM GMTపాకిస్తాన్లో ఇక మీ ఆటలు సాగవ్... ఇమ్రాన్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని...
27 May 2022 6:07 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTతిరుపతికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
27 May 2022 5:22 AM GMT