భారీగా పెరిగిన అజ్ఞాతవాసి టికెట్ల‌ ధ‌ర‌లు

భారీగా పెరిగిన అజ్ఞాతవాసి టికెట్ల‌ ధ‌ర‌లు
x
Highlights

సినిమా కాపీ రైట్స్ చిక్కులు ఎలా ఉన్నా అజ్ఞాతవాసి టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్న‌ట్లు మార్కెట్ పండితులు చెబుతున్నారు. కొద్దిరోజుల్లో విడుద‌ల...

సినిమా కాపీ రైట్స్ చిక్కులు ఎలా ఉన్నా అజ్ఞాతవాసి టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్న‌ట్లు మార్కెట్ పండితులు చెబుతున్నారు. కొద్దిరోజుల్లో విడుద‌ల కానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గ‌తంలో డైర‌క్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ -ప‌వ‌న్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన సినిమాలు క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురింపిచాయి. అంత‌కు మించి భారీగా వ‌సూళ్ల రాబ‌డుతూ బాహుబలి 2, ఖైది నెంబర్ 150 రికార్డ్స్ బద్దలు కొడుతుంద‌ని పవన్ ఫాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు.

ఇక ఈ సినిమా టికెట్ల విష‌యంలో తెలుగురాష్ట్రాల్లో భిన్నంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా టికెట్ ధ‌ర‌లు పెంచుకునే ప్ర‌య‌త్నం చేశారు నిర్మాత‌లు. అందుకు తాము సిద్ధ‌మేన‌న్న సంకేతాలిచ్చిన ఏపీ ప్ర‌భుత్వం టికెట్ రేట్ల‌ను సవ‌రించింది. దీంతో ఏపీలో కొన్ని సెంట‌ర్ల‌లో ఎక్కువ రేట్ల‌కే టికెట్ల అమ్మ‌కాలు జ‌రిగాయి. పేటిఎం, బుక్ మై షో లాంటి యాప్స్ లో అధిక ధరలే కనిపిస్తున్నాయి. థర్డ్ క్లాసు టికెట్ కనీస ధర 80 రూపాయలతో మొదలు పెట్టి అత్యధికంగా 300 రూపాయల దాకా వీటి అమ్మకాలు సాగనున్నాయి. ఇక తెలంగాణ‌లో మాత్రం పాత ధ‌ర‌ల‌తోనే అజ్ఞాతవాసి జ‌ర‌గ‌నున్నాయి. హైదరాబాద్ లో కొన్ని సింగల్ స్క్రీన్స్ లో పాత ధరలకే ఆన్ లైన్ అడ్వాన్సు బుకింగ్ ఓపెన్ చేసారు. దీనిపై పవన్ ఫాన్స్ మాత్రం ఆంధ్రలో ఉన్నవాళ్లు ఏం పాపం చేసారని టికెట్ ధర ఎక్కువ పెట్టి కొనాలి, తెలంగాణాలో మాత్రం మామూలు ధరకే సినిమా చూస్తారా అని ప్రశ్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories