logo
సినిమా

బావ మోసం చేశాడంటూ సినీనటి తారాచౌదరి ఫిర్యాదు

బావ మోసం చేశాడంటూ సినీనటి తారాచౌదరి ఫిర్యాదు
X
Highlights

తనను పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడంటూ పైగా తన ఆస్తులు కాజేసేందుకు యత్నిస్తున్నాడని సినీ నటి తారాచౌదరి...

తనను పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడంటూ పైగా తన ఆస్తులు కాజేసేందుకు యత్నిస్తున్నాడని సినీ నటి తారాచౌదరి తనబావపై బంజారాహిల్స్ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. సినీనటి తారాచౌదరి ఆమెకు వరుసకు బావ అయిన చావా రాజ్‌కుమార్‌, ఆయన సోదరి సూజాతకు చాలా సన్నిహిత సంబంధాలుండేవి. కాగా రాజ్‌కుమార్‌ను పెళ్లి చేసుకోవాలని తారాను సూజాత కోరింది. అయితే గతంలోనే రాజ్‌కుమార్‌కు వివాహం అయిందని అడిగితే విడుకులు తీసుకోనున్నట్లూ వెల్లడించింది. అయితే తారాచౌదరి మొదటి నుంచే తనతో పెళ్లిని వద్దుంటునే వస్తుంది. బంజారాహిల్స్ నుండి విజయవాడకు వెళ్లింది. అక్కడికి కూడా చావా రాజ్‌కుమార్‌ వెళ్లి కూడా తను తారాచౌదరి భర్తగానే చెప్పుకొచ్చాడు. కాగా తారాచౌదరి పెళ్లి చేసుకోవాలని అడిగితే కుంటిసాకులు చెబుతూ రాజ్‌కుమార్‌ తప్పించుకుంటున్నాడు అని తెలిపింది. దీంతో చావా రాజ్‌కుమార్‌‌ను తారాచౌదరి తీవ్రఒత్తిడి చేసిన కాని పెళ్లికి నిరాకరిస్తున్నడని, గత రెండేళ్లుగా రాజ్‌కుమార్‌ తనను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు తారాచౌదరి ఫిర్యాదు చేసింది. పోలీసులు తనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story